Andhra Pradesh: పోలీసుల భయంతో బిల్డింగ్‌పై నుంచి దూకిన వ్యక్తి.. కట్ చేస్తే వెలుగులోకి దిమ్మతిరిగే నిజాలు..

పోలీసులు పట్టుకుంటారన్న భయంతో ఉద్ధగిరి అలేఖ్య అనే వ్యక్తి బిల్డింగ్ పైనుంచి దూకేశాడు. అబ్బాయి పేరు అలేఖ్య ఏంటి? దూకడం..

Andhra Pradesh: పోలీసుల భయంతో బిల్డింగ్‌పై నుంచి దూకిన వ్యక్తి.. కట్ చేస్తే వెలుగులోకి దిమ్మతిరిగే నిజాలు..
Representative Image
Follow us

|

Updated on: Nov 18, 2022 | 8:28 AM

పోలీసులు పట్టుకుంటారన్న భయంతో ఉద్ధగిరి అలేఖ్య అనే వ్యక్తి బిల్డింగ్ పైనుంచి దూకేశాడు. అబ్బాయి పేరు అలేఖ్య ఏంటి? దూకడం ఏంటనుకుంటున్నారా.. అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. అతని ఉద్ధగిరి అలేఖ్య. అతనిది పల్నాడు జిల్లా గురజాల మండలం చర్లగుడిపాడు గ్రామం. పోలీసులు చెకింగ్‌కి వచ్చారన్న భయంతో ఇంటి బిల్డింగ్ పై నుంచి దూకి మరీ ఇలా ఆస్పత్రి పాలయ్యాడు. అతని చర్య చూస్తే.. పోలీసులకు అంత భయపడేంత తప్పు ఏం చేశాడనే డౌట్ రాకుండా ఉండదు. అవను.. అందరూ అవాక్కయ్యేంత ఘరానా మోసం చేశాడు. అదే దొంగ నోట్ల ముద్రణ.

చర్లగుడిపాడులోని ఈ అలేఖ్య ఇంట్లో దొంగ నోట్లు ముద్రిస్తున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు తనిఖీలు నిర్వహించేందుకు అతని ఇంటికి వెళ్లారు. పోలీసులను చూసిన ఉద్ధగిరి అలేఖ్య.. ఎక్కడ పట్టుకుంటారనే భయంతో డాబా మీద నుంచి దూకేశాడు. కాలికి తీవ్ర గాయాలు కావడంతో.. నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ హాస్పటల్‌కు తరలించి వైద్యం అందిస్తున్నారు.

నిందితుడి దగ్గర ఏకంగా కోటీ 50 లక్షలు రూపాయలు విలువ చేసే దొంగ నోట్లు దొరికినట్లు సమాచారం. నిందితుడిపై గతంలోనూ పలు కేసులు ఉన్నాయి. ఇప్పుడు దొంగ నోట్లు ముద్రించడం.. అది కూడా ఇంత పెద్ద మొత్తంలో పట్టుబడటంతో.. పోలీసులు సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్నారు. అతని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..