WDCW AP Recruitment 2022: విశాఖపట్నంలోని గృహహింస రక్షణ విభాగంలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..
ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విశాఖపట్నం గృహహింస రక్షణ విభాగంలో.. ఒప్పంద ప్రాతిపదికన లీగల్ కౌన్సిలర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల..
ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విశాఖపట్నం గృహహింస రక్షణ విభాగంలో.. ఒప్పంద ప్రాతిపదికన లీగల్ కౌన్సిలర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ/బీఎల్ లేదా తత్సమాన డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. న్యాయవాదిగా కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి. సొంత ప్రాక్టీస్ చేసే వారు అనర్హులు. అలాగే అభ్యర్ధుల వయసు జులై 1, 2022వ తేదీ నాటికి 42 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఆఫ్‌లైన్ విధానంలో నవంబర్ 23, 2022వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు కింది అడ్రస్‌లో దరఖాస్తులను సమర్పించవల్సి ఉంటుంది. విద్యార్హతలు, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.35,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చెక్ చేసుకోవచ్చు.
అడ్రస్..
జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ, సాధికారత రక్షణ అధికారి, గృహహింస చట్టం వారి కార్యాలయం, రెండవ ఆంతస్తు, ప్రగతి భవన్, సెక్టార్-9, ఎంవీపీ కాలనీ, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.