Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: నన్నే ప్రశ్నిస్తావా? అంటూ సబ్ కలెక్టర్‌పై ఫైర్ అయిన ఎమ్మార్వో.. కట్ చేస్తే సీన్ మైండ్ బ్లాంకే..

సమస్యలపై ప్రశ్నించిన సబ్ కలెక్టర్ పై నోరు పారేసుకున్నాడు ఎమ్మార్వో. విషయం కలెక్టర్‌కు తెలియడంతో వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Andhra Pradesh: నన్నే ప్రశ్నిస్తావా? అంటూ సబ్ కలెక్టర్‌పై ఫైర్ అయిన ఎమ్మార్వో.. కట్ చేస్తే సీన్ మైండ్ బ్లాంకే..
Tarlupadu
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 18, 2022 | 8:30 AM

సమస్యలపై ప్రశ్నించిన సబ్ కలెక్టర్ పై నోరు పారేసుకున్నాడు ఎమ్మార్వో. విషయం కలెక్టర్‌కు తెలియడంతో వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుందీఘటన. వివరాల్లోకెళితే.. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల తహశీల్దార్ కృష్ణారెడ్డిపై వేటు పడింది. ఎమ్మార్వోను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల కలెక్టర్ నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్ లో తహశీల్దార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు మార్కాపురం సబ్ కలెక్టర్ సేతు మాధవన్. మండల సమస్యలపై దృష్టిపెట్టాలని వార్నింగ్ ఇచ్చారు.

దీంతో ఆగ్రహించిన ఎమ్మార్వో నన్నే అలా మాట్లాడతావా అంటూ సబ్ కలెక్టర్ తో వాదనకు దిగాడు. సబ్ కలెక్టర్ సేతు మాధవన్ పై విమర్శలకు దిగాడు తహశీల్దార్ కృష్ణారెడ్డి. ఈ విషయం కలెక్టర్ దినేష్ కుమార్ దగ్గరకు చేరడంతో ఎమ్మార్వో కృష్ణారెడ్డిపై చర్యలు తీసుకున్నారు. తహశీల్దార్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు కలెక్టర్ దినేష్ కుమార్. జులై 5వ తారీఖున తర్లుపాడు మండల ఎమ్మార్వో గా వెంకటకృష్ణారెడ్డి బాధ్యతలు స్వీకరించారు.

కనిగిరి ఆర్డీవో కార్యాలయంలో పరిపాలన అధికారిగా పనిచేస్తూ ఎమ్మార్వో గా ఇక్కడికి బదిలీపై వచ్చారు. మండలంలోని పలు సమస్యలపై దృష్టిపెట్టడం లేదంటూ పదేపదే ఎమ్మార్వోపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో సబ్ కలెక్టర్ హెచ్చరించారు. చర్యలు తీసుకోకుండా సబ్ కలెక్టర్ పై నే రివర్స్ అవడంతో సస్పెండ్ చేశారు కలెక్టర్.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..