Cheating: ద్వారకా తిరుమలలో ఘరానా మోసం.. బ్యాంకు ఉద్యోగిని అని చెప్పి ఏకంగా..

Cheating: ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో ఘరానా మోసం వెలుగు చూసింది. తాను బ్యాంక్ ఉద్యోగిని అని నమ్మించి...

Cheating: ద్వారకా తిరుమలలో ఘరానా మోసం.. బ్యాంకు ఉద్యోగిని అని చెప్పి ఏకంగా..
Cheating
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 18, 2021 | 11:15 PM

Cheating: ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో ఘరానా మోసం వెలుగు చూసింది. తాను బ్యాంక్ ఉద్యోగిని అని నమ్మించి ఓ అమాయక రైతు వద్ద నుంచి రూ. 1.10 లక్షలు కాజేశాడు. ఈ ఘటన ద్వారకా తిరుమలలోని యూనియన్ బ్యాంక్ వద్ద చోటు చేసుకుంది. ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈశ్వరరావు అనే రైతు క్రాప్ లోన్ చెల్లించడం కోసం శుక్రవారం ఉదయం యూనియన్ బ్యాంక్ వద్దకు వచ్చాడు. రైతు వద్ద నగదు ఉండటాన్ని గమనించి ఓ కేటుగాడు.. రైతులో మాటలు కలిపాడు. ఆపై తాను బ్యాంకు ఉద్యోగిని అని, సాయం చేస్తానంటూ నమ్మబలికాడు. డబ్బులు తాను బ్యాంకులో జమ చేస్తున్నట్లు నటించి రూ. 1.10 లక్షలు తీసుకున్నాడు.

ఇక బ్యాంకులో సొమ్ము డిపాజిట్ చేసినట్లు ఓ డమ్మీ ఓచర్‌ను కేటుగాడు ఈశ్వరరావుకు అప్పగించాడు. అయితే, అది తెలవని ఈశ్వరరావు ఆ ఓచర్‌ని తీసుకుని ఇంటిక వెళ్లాడు. ఆ తరువాత విషయాన్ని గ్రహించి.. తాను మోసపోయానని తెలుసుకున్నాడు. వెంటనే పోలీసులను ఆశ్రయించాడు రైతు ఈశ్వరరావు. జరిగిందంతా పోలీసులకు వివరించి ఫిర్యాదు చేశాడు. ఈశ్వరరావు ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

Also read:

Internet Browsers: ఇంటర్నెట్ బ్రౌజింగ్ కోసం క్రోమ్ ని యూజ్ చేస్తున్నారా?.. అయితే వీటిపై ఓసారి లుక్కేయండి..