AP High Court: ధూళిపాళ్ల బెయిల్ రద్దు కోరుతూ హైకోర్టులో ఏసీబీ పిటిషన్.. నిబంధనలు ఉల్లంఘించారంటూ వాదన..

AP High Court: సంగం డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్ర బెయిల్ రద్దు కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ఏసీబీ పిటిషన్ దాఖలు చేసింది.

AP High Court: ధూళిపాళ్ల బెయిల్ రద్దు కోరుతూ హైకోర్టులో ఏసీబీ పిటిషన్.. నిబంధనలు ఉల్లంఘించారంటూ వాదన..
AP HC
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 18, 2021 | 11:26 PM

AP High Court: సంగం డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్ర బెయిల్ రద్దు కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ఏసీబీ పిటిషన్ దాఖలు చేసింది. నరేంద్ర నిబంధనలు ఉల్లంఘించారని ఏసీబీ వాదనలు వినిపించింది. ఏసీబీ వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. ప్రతివాదులకు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 23 వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. కాగా, ధూళిపాళ్ల నరేంద్ర, ఎండీ గోపాలకృష్ణన్‌లకు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దర్యాప్తు అధికారులు ఇప్పటికే అవసరమైన దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారని, పిటిషనర్లు కరోనా బారినపడి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నందున బెయిల్‌ ఇస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది.

బెయిల్‌ నిమిత్తం విజయవాడలోని ఏసీబీ కోర్టులో పిటిషనర్లు ఇద్దరూ రూ.లక్ష చొప్పున రెండు లక్షలు పూచికత్తులు సమర్పించాలని ఆదేశించింది. అలాగే.. బెయిల్‌పై విడుదలైన తేదీ నుంచి 4 వారాల పాటు విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధి దాటి బయటకు వెళ్లకూడదని స్పష్టం హైకోర్టు ధర్మాసనం చేసింది. పిటిషనర్లు నివాసం ఉండే చిరునామాను ఏసీబీ అధికారులకు ఇవ్వాలని సూచించింది. ఇక దర్యాప్తులో భాగంగా పిటిషనర్లను విచారించాలని అధికారులు భావిస్తే 24 గంటల ముందు నోటీసులు జారీ చేయాలని స్పష్టం చేసింది.

Also read:

Cheating: ద్వారకా తిరుమలలో ఘరానా మోసం.. బ్యాంకు ఉద్యోగిని అని చెప్పి ఏకంగా..