Janasena Party: జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేశారు.. నాదెండ్ల మనోహర్ ఫైర్..

Janasena Party: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ విధానాలపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు

Janasena Party: జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేశారు.. నాదెండ్ల మనోహర్ ఫైర్..
Nadendla Manohar
Follow us

|

Updated on: Jun 18, 2021 | 11:43 PM

Janasena Party: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ విధానాలపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగ యువతను ప్రభుత్వం మోసం చేసిందని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసిన నాదెండ్ల మనోహర్.. ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్ 1, గ్రూప్ 2ల్లో భర్తీ చేసేది కేవలం 36 పోస్టులా? ప్రభుత్వాన్ని నిలదీశారు. డీఎస్సీ గురించి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామ వాలంటీర్లది స్వచ్ఛంద సేవ అని చెప్పిన ముఖ్యమంత్రి.. ప్రచారం కోసం ఉద్యోగాలని చెబుతున్నారని ధ్వజమెత్తారు. శాఖల వారీగా ఉన్న ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఎన్నికలకు ముందు ఏపీపీఎస్సీ ద్వారా 2లక్షల 30వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన వైసిపి- అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత మాట మార్చి మడమ తిప్పిందని మర్శించారు నాదెండ్ల మనోహర్. జాబ్ క్యాలెండర్ కోసం పలు ముహూర్తాలు మార్చి.. ఈ రోజు క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారి ఆశలపై నీళ్లు చల్లారని అన్నారు. ప్రతియేటా జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ అని ఎన్నో తేదీలు మార్చారని దుయ్యబట్టారు. జనవరి 1వ తేదీకి ఇవ్వలేదు.. తెలుగు సంవత్సరాదికీ(ఉగాది) ఇవ్వలేకపోయారన్నారు. చివరకు తూతూ మంత్రంగా క్యాలెండర్ ఇచ్చి నిరుద్యోగులను నిరాశపరిచారని అన్నారు. లక్షల ఉద్యోగాలు ఇస్తాం అని మేనిఫెస్టోలో చెప్పిన వైసీపీ.. చివరికి ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2ల్లో కేవలం 36 పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయని చూపించిందని విమర్శలు గుప్పించారు.

హామీ లక్షల్లో ఇచ్చి భర్తీ మాత్రం నామమాత్రంగా చేస్తామనడం ద్వారా ప్రభుత్వానికి జాబ్ క్యాలెండర్ ప్రకటనలో ఎంత మాత్రం చిత్తశుద్ధి లేదు అని అర్థమవుతుందని నాదెండ్ల పేర్కొన్నారు. ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయదగ్గ ఉద్యోగాలు ప్రతి ఏటా భారీగా ఖాళీ అవుతున్నాయన్నారు. ఆ లెక్కలను ప్రభుత్వం ఎందుకు దాచిపెడుతుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో వేల సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటి భర్తీకి సంబంధించి డీఎస్సీ గురించి ఎందుకు మాట్లాడటం లేదన్నారు. సర్కార్ కు ఉపాధ్యాయ పోస్టులు నింపే ఉద్దేశం లేనట్లు కనిపిస్తోందని ఆరోపించారు. గ్రామ సచివాలయాల్లో ఉన్న ఖాళీల మాటేమిటి? అని ప్రశ్నించారు.

వైసీపీ ప్రభుత్వం ఈ రోజు చేసిన ప్రకటనలో 2.59 లక్షల గ్రామ వాలంటీర్ ఉద్యోగాలు భర్తీ చేశాం అని గొప్పలు చెప్పుకుందన్న ఆయన.. ఇదే వాలంటీర్లు తమకు జీతాలు పెంచాలని ఆందోళనకు సిద్ధమైతే మీవి ఉద్యోగాలు కావు స్వచ్ఛంద సేవ మాత్రమే అని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారని నాదెండ్ల గుర్తు చేశారు. జాబ్ క్యాలెండర్ ప్రచారం కోసం మాత్రం వాళ్ళవి ఉద్యోగాలు అని చెబుతున్నారని దుయ్యబట్టారు. ఇందులో ఏది నిజం? అని ప్రశ్నించారు. వాలంటీర్లవి ఉద్యోగాలు అయితే జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. వాళ్లది స్వచ్ఛంద సేవ అనుకున్న పక్షంలో జాబ్ క్యాలెండర్లో చెప్పింది అబద్ధం అని ప్రకటన చేయాలన్నారు. ఆర్టీసీలో 51 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆ సంస్థ ప్రభుత్వంలో విలీనం అయ్యేనాటికి ఉద్యోగాలు చేస్తున్న వారిని కూడా వైసిపి వాళ్ళు నియమించినట్లు చెప్పడం విచిత్రంగా ఉందన్నారు. తప్పుడు ప్రకటన ద్వారా ఎవరిని వంచించాలని వైసీపీ ప్రభుత్వం చూస్తోందంటూ నాదెండ్ల ఫైర్ అయ్యారు.

ఇక శాఖల వారీగా భర్తీ చేస్తున్నట్లు చెబుతున్నా.. ఆ పోస్టుల ఖాళీలు కూడా చాలా తక్కువ చేసి చూపించారని నాదెండ్ల మనోహర్ రోపించారు. రెవెన్యూ శాఖలో తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, సర్వేయర్లు తదితర పోస్టులు అనేకం ఖాళీ ఉన్నాయని, కానీ, అసలు వాటి ప్రస్తావన లేకుండానే జాబ్ క్యాలెండర్ ఇచ్చారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో శాఖల వారీగా ఉన్న ఖాళీలను పారదర్శకంగా గుర్తించి వాటిపై శ్వేతపత్రం విడుదల చేయాలని, ఖాళీలను ఎప్పుడు భర్తీ చేస్తారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మనోహర్ డిమాండ్ చేశారు.

Also read:

AP High Court: ధూళిపాళ్ల బెయిల్ రద్దు కోరుతూ హైకోర్టులో ఏసీబీ పిటిషన్.. నిబంధనలు ఉల్లంఘించారంటూ వాదన..