Earth Heat: భూప్రళయం ముంచుకొస్తోందా ? అధిక ఉష్ణోగ్రతలతో అట్టుడుకుతున్న భూగోళం.. ధరణికి మరో పెను ముప్పు..

ధరణికి మరో ముప్పు పొంచి ఉందా ? త్వరలో భూగర్బ జలాలు అడుగంటిపోతున్నాయా ? ఒకవైపు కరోనా విలయంతో ప్రజలు భయాందోళనలకు గురవుతుంటే..

Earth Heat: భూప్రళయం ముంచుకొస్తోందా ? అధిక ఉష్ణోగ్రతలతో అట్టుడుకుతున్న భూగోళం.. ధరణికి మరో పెను ముప్పు..
Earth Heat

ధరణికి మరో ముప్పు పొంచి ఉందా ? త్వరలో భూగర్బ జలాలు అడుగంటిపోతున్నాయా ? ఒకవైపు కరోనా విలయంతో ప్రజలు భయాందోళనలకు గురవుతుంటే.. మరో వైపు మహా ప్రళయం భూమిని ముంచెత్తబోతున్నట్లుగా తెలుస్తోంది. భూ వాతావరణంలో పెరిగిపోతున్న వేడితో భూమి వేడెక్కుతుంది. ఎన్నడూలేనంతగా భూమి దాదాపు 15ఏళ్ల క్రితం కంటే వాతావరణంలో రెట్టింపు స్థాయిలో ఉష్ణోగ్రతలు వేడిక్కినట్టు నాసా గుర్తించింది. నాసా నేషనల్ ఓషియానిక్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) సంయుక్తంగా అధ్యయనం చేసింది. వేడి రూపంలో ఎక్కువ శక్తి భూమి వాతావరణంలోకి చేరిందని, దాంతో ఉన్నట్టుండి మన గ్రహం వేడిక్కిపోతోందని అంటోంది. దీని కారణంగా భూవాతావరణంలో ఉష్ణోగ్రతల్లో భారీగా మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంటుంది.

భూ గ్రహం పై మహా సముద్రాలు సైత ఆవిరై ఎడారిగా మారిపోతున్నాయి. ప్రస్తుతం పశ్చిమ అమెరికన్‌లో తాండవిస్తున్న తీవ్రమైన కరువు వంటి పరిస్థితులకు దారితీస్తుందని అధ్యయనం సూచిస్తోంది. ఈమేరకు జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్ జర్నల్‏లో ఈ అధ్యయనాన్ని ప్రచురించింది. ఇందులో వాతావరణ ఉష్ణోగ్రతలలో మార్పులను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు సెన్సార్ల నుంచి సముద్రపు ప్రాంతంలోని డేటాను సేకరించారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలను సూచించే ఇతర డేటా గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలలో గణనీయమైన పెరుగుదల కనిపించినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. మీథేన్, కార్బన్ డయాక్సైడ్ వంటి వాయువులు పెరిగిపోవడంతో భూమిలో వేడిని ఎక్కువ స్థాయిలో ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని చెబుతోంది. భూమి వేడెక్కడం ద్వారా కలిగే మార్పులన్నీ భూమిపై పర్యావరణ క్షీణతకు కారణమవుతాయని అధ్యయనం తెలిపింది. 2005 నుంచి 2019 వరకు 14 ఏళ్ల కాలంలో అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రత రెట్టింపు అయిందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. భూ వాతావరణంలోకి వచ్చే అధిక వేడి.. అనేక కారకాల ఫలితంగా భూమి వేడెక్కవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ ఫలితాలు మరో కోణంలో చూస్తే చాలా భయంకరమైనవని నాసా లాంగ్లీ రీసెర్చ్ సెంటర్‌లో అధ్యయనంలో ప్రధాన పరిశోధకుడు నార్మన్ లోబ్ చెప్పారు. అది భూమిపై ఉష్ణోగ్రతల్లో పెద్ద మార్పుకు దారితీస్తుందని ఎన్నడూలేనంతగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయని, ఫలితంగా అతి భయంకరమైన కరువు సంభవించబోయే ప్రమాదం లేకపోలేదని అంటున్నారు.

మరోవైపు.. సగటు కంటే చల్లటి ఉష్ణోగ్రతలు భూమి వాతావరణంలో నమోదైన శక్తిని పెంచేందుకు దోహదం చేస్తాయని గుర్తించారు. పసిఫిక్ డెకాడల్ ఆసిలేషన్ (PDO) వంటి కొన్ని వాతావరణంలో సహజంగా సంభవిస్తాయని, కానీ, మానవుల వల్ల కలిగే వాతావరణ మార్పుల ప్రభావాలను కూడా పెంచుతాయని అంటున్నారు. వాతావరణంలోకి వచ్చే అధిక వేడి ఇతర కారకాల వలన కలగవచ్చని చెబుతున్నారు.

Also Read: Sai Pallavi: మరో క్రేజీ ప్రాజెక్ట్ సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్.. బాలీవుడ్ సినిమాలో సారంగదరియా..

Click on your DTH Provider to Add TV9 Telugu