Internet Browsers: ఇంటర్నెట్ బ్రౌజింగ్ కోసం క్రోమ్ ని యూజ్ చేస్తున్నారా?.. అయితే వీటిపై ఓసారి లుక్కేయండి..
Internet Browsers: ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది బ్రౌజింగ్ కోసం క్రోమ్‌ను అధికంగా యూజ్ చేస్తారు. మనకు ఎలాంటి సమాచారం కావాలన్నా టక్కున గుర్తుకొచ్చేది గూగుల్ క్రోమ్ మాత్రమే.
Internet Browsers: ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది బ్రౌజింగ్ కోసం క్రోమ్‌ను అధికంగా యూజ్ చేస్తారు. మనకు ఎలాంటి సమాచారం కావాలన్నా టక్కున గుర్తుకొచ్చేది గూగుల్ క్రోమ్ మాత్రమే. దానికున్న ప్రాచుర్యం అలాంటిది. అయితే ప్రస్తుత సాంకేతిక యుగం గూగుల్ క్రోమ్‌ని మించి చాలా బ్రౌజర్లు అందుబాటులో ఉన్నాయి. చాలా మంది క్రోమ్ లేదా ఎడ్జ్‌ని మాత్రమే వినియోగిస్తుంటారు. అయితే, వాటితో పోటి పడుతూ అనే బ్రౌజర్లు వస్తున్నాయి. అలాంటి ప్రముఖమైన బ్రౌజర్లను ఇవాళ మనం తెలుసుకుందాం.
1 / 6
ఒపెరా: గూగుల్ క్రోమ్, ఎడ్జ్ తో పాటు చాలా మంది ఒపెరా బ్రౌజర్‌ను కూడా వినియోగిస్తుంటారు. దీని స్పెసాలిటీ ఏంటంటే.. గూగుల్ క్రోమ్, ఎడ్జ్ బ్రౌజర్ల కంటే కూడా వేగంగా పనిచేస్తుంది. సెక్యూరిటీ ఫిచర్లు కూడా ఉంటాయి.
2 / 6
వివాల్డీ బ్రౌజర్: ఒపెరా బ్రౌజర్‌ను రూపొందించిన డెవలపర్స్‌నే వివాల్డీని రూపొందించారు. ఒపెరా, క్రోమ్‌తో పోలిస్తే ఇందులో ఫీచర్లు తక్కువగానే ఉంటాయి. కానీ ఈ బ్రౌజర్ స్పీడ్ మిగిలిన బ్రౌజర్లు అన్నింటికంటే ఎక్కువగానే ఉంటుంది.
3 / 6
టార్ బ్రౌజర్: ప్రైవసీ పరంగా ఇది చాలా బెటర్ అని చెప్పాలి. ఈ టార్ బ్రౌజర్‌ను వాడినప్పుడు ఎలాంటి నిఘా ఎఫెక్ట్ ఉండదు. బ్రౌజర్‌ను ఉపయోగించడం పూర్తవగానే.. అందులోని హిస్టరీ, కుకీస్ ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతాయి. దాంతో అటు సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా, ఇటు ప్రభుత్వ నిఘా నించు కూడా తప్పించుకోవచ్చు.
4 / 6
సఫారీ: ఇది యాపిల్ ఫోన్లు, కంప్యూటర్లలో డిఫాల్ట్‌గా వస్తుంది. దీని ప్రైవసీ లెవల్స్ పీక్స్ అని చెప్పాలి. బ్రౌజింగ్ స్పీడ్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. అంతేకాదు.. మిమ్మల్ని ఎవరైనా ట్రాక్ చేస్తున్నా ఈ బ్రౌజర్‌లో ఉన్న ఫీచర్ల ఆధారంగా తెలుసుకోవచ్చు.
5 / 6
బ్రేవ్: ఈ బ్రౌజర్‌లో యాడ్ ట్రాకర్ బిల్ట్ ఇన్‌గా వస్తుంది. తద్వారా.. అడ్వర్టై్జ్ కంపెనీలు మన బ్రౌజింగ్ హిస్టరీని ట్రాక్ చేయలేవు. అలాగే.. క్రోమ్ కంటే కూడా మూడు రెట్లు వేగంగా ఇది పని చేస్తుంది. బ్యాటరీ వినియోగం కూడా చాలా తక్కువగా ఉంటుంది.