Nara Lokesh: లోకేష్ పాదయాత్ర ముగింపు సభ అక్కడే! భారీ ఏర్పాట్లు చేస్తున్న నేతలు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు పార్టీ ముఖ్య నేతలు. అందుకోసం విజయనగరం జిల్లా పోలిపల్లి వద్ద గల ఓ ప్రైవేటు రియల్ ఎస్టేట్ వెంచర్లో సభా ప్రాంగణాన్ని సిద్ధం చేస్తున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెనాయుడు శుభ ముహూర్తం ప్రకారం కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు. దీంతో పాదయాత్ర ముగింపు సభకు ఏర్పాట్లు ప్రారంభమైనట్లు తెలుస్తోంది.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు పార్టీ ముఖ్య నేతలు. అందుకోసం విజయనగరం జిల్లా పోలిపల్లి వద్ద గల ఓ ప్రైవేటు రియల్ ఎస్టేట్ వెంచర్లో సభా ప్రాంగణాన్ని సిద్ధం చేస్తున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెనాయుడు శుభ ముహూర్తం ప్రకారం కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు. దీంతో పాదయాత్ర ముగింపు సభకు ఏర్పాట్లు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఈ సభకు సంబంధించిన మొత్తం ఏర్పాట్లను ప్రధానంగా ఉత్తరాంధ్రకు చెందిన ముఖ్య నేతలు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ క్యాడర్‌ను ఉత్సాహపరిచేలా కార్యక్రమాన్ని నిర్వహించాలని కసరత్తు చేస్తున్నారు. ఈ సభకు యువత పెద్దఎత్తున హాజరయ్యేలా ప్రణాళిక రచిస్తున్నారు. కుప్పంలో ప్రారంభమైన పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా వరకు కొనసాగించి చివరిగా ఆ జిల్లాలోనే ముగించాలని మొదట పాదయాత్ర షెడ్యూల్ రూపొందించారు. అనుకున్నట్లే కుప్పంలో ప్రారంభమైన లోకేష్ పాదయాత్ర దాదాపు అన్ని జిల్లాల మీదుగా సాగింది.
పాదయాత్ర జరుగుతున్న సమయంలో చంద్రబాబు అరెస్ట్‌తో పాటు రాష్ట్రంలో నెలకొన్న పలు రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో విజయనగరం, శ్రీకాకుళం పర్యటన లేకుండానే విశాఖ జిల్లాలో ముగిస్తున్నట్లు ప్రకటించారు నారా లోకేష్. అయితే విశాఖలో పాదయాత్ర ముగిస్తున్న కారణంగా షెడ్యూల్ ప్రకారం విజయనగరం, శ్రీకాకుళంకు రాకపోవడంతో ఆయా జిల్లాలకు చెందిన పలువురు పార్టీ నేతలు కొంత నిరుత్సాహన్ని వ్యక్త పరిచారు. దీంతో ఆ రెండు జిల్లాలను కూడా కవర్ చేసేలా ముగింపు సభ పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో అక్కడి టిడిపి క్యాడర్‌ను కవర్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. అందుకోసం విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం జిల్లాలకు మధ్య ప్రాంతాన్ని ఎంపిక చేశారు. సభా ప్రాంగణానికి రాష్ట్ర నలుమూలల నుండి వచ్చే పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు తగు ఏర్పాట్లు చేస్తున్నారు. నేషనల్ హైవే ప్రక్కనే ఉన్న పోలిపల్లి వద్ద యువగళం ముగింపు సభకు అనువైన ప్రదేశంగా గుర్తించి అవసరమైన పనుల్లో వేగం పెంచారు.

Nara Lokesh Yuvagalam Padayatra
సుమారు 3,000 కిలోమీటర్లు పైగా కొనసాగుతున్న లోకేష్ పాదయాత్ర ముగింపు సభ విజయనగరంలో ఉండటంతో ఉత్తరాంధ్ర శ్రేణులు సైతం తమ ఆనందాన్ని వ్యక్త పరుస్తున్నారు. ఈ ముగింపు సభ ఏర్పాట్లు చూసుకునేందుకు ఉత్తరాంధ్ర ముఖ్య నేతలు, కార్యకర్తలు సభా ప్రాంగణానికి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. అయితే ఈ సభకు సుమారు ఐదు లక్షల మంది వరకు కార్యకర్తలు హాజరవ్వనున్నట్లు చెప్తున్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ముందుగా యువగళం ముగింపు సభ ఆంధ్ర యూనివర్శిటీ గ్రౌండ్స్‌లో నిర్వహించేలా ప్లాన్ చేసినట్లు తెలిపారు. అయితే కొన్ని భద్రతా పరమైన పరిస్థితుల దృష్ట్యా అక్కడ నుండి విజయనగరం జిల్లాకు మార్చామని తెలిపారు. క్యాడర్‌కు ఎలాంటి రవాణా ఇబ్బందులు లేకుండా ప్రత్యేక బస్సులు ఏర్పాటుతో పాటు కార్యకర్తలకు అసౌకర్యం కలుగకుండా అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..