Sajjala – Sharmila: షర్మిల ఏపీ రాజకీయాల్లోకి వస్తారో.. రారో? ఆమె ఇష్టం.. వైసీపీ నేత సజ్జల కీలక వ్యాఖ్యలు..

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేం సిద్ధం.. షర్మిల ఏపీ రాజకీయాల్లోకి వస్తారో.. రారో? ఆమె ఇష్టం.. అభ్యర్థులు లేక ప్రతిపక్షాలు ఏవో మాట్లాడుతున్నాయి.. అంటూ వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడిన సజ్జల రామకృష్ణరెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అభ్యర్థులు లేక ప్రతిపక్షాలు ఏవేవో మాట్లాడతున్నాయని.. టీడీపీ, జనసేన అసలు పొత్తులో ఉందా? అంటూ ప్రశ్నించారు.

Sajjala - Sharmila: షర్మిల ఏపీ రాజకీయాల్లోకి వస్తారో.. రారో? ఆమె ఇష్టం.. వైసీపీ నేత సజ్జల కీలక వ్యాఖ్యలు..
Sajjala Ramakrishna Reddy, YS Sharmila
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 13, 2023 | 9:55 PM

షర్మిల ఏపీ రాజకీయాల్లోకి వస్తారో.. రారో? ఆమె ఇష్టం.. అభ్యర్థులు లేక ప్రతిపక్షాలు ఏవేవో మాట్లాడుతున్నాయి.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేం సిద్ధం.. అంటూ వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడిన సజ్జల రామకృష్ణరెడ్డి.. ప్రతిపక్ష పార్టీలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అభ్యర్థులు లేక ప్రతిపక్షాలు ఏవేవో మాట్లాడతున్నాయని.. టీడీపీ, జనసేన అసలు పొత్తులో ఉందా? అంటూ ప్రశ్నించారు. ఒక మీటింగ్ పెట్టుకున్నారు.. తరవాత ఇరు పార్టీలు కొట్టుకున్నాయంటూ విమర్శించారు. అనారోగ్యం అంటూ గగ్గోలు పెట్టిన చంద్రబాబు ఇప్పుడు పార్టీ మీటింగ్ లు అంటూ హడావుడి చేస్తున్నారన్నారు. పవన్ కళ్యాణ్ తెలంగాణలో పోటీ చేసి.. నోటా కంటే ఓట్లు తెచ్చుకున్నారంటూ విమర్శించారు. ఈ సందర్భంగా ఏపీ రాజకీయాల్లో షర్మిల ఎంట్రీపై సజ్జల స్పందించారు. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టుకున్నారు.. ఏపీ రాజకీయాల్లోకి వస్తారో లేదో ఆమె ఇష్టం.. ఎవరైనా పోటీ చేసేందుకు రాజ్యంగం హక్కు కల్పించిందంటూ సజ్జల పేర్కొన్నారు. ఎన్ని పార్టీలు వచ్చినా వైసీపీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందన్నారు.

పలు నియోజకవర్గాల్లో ఇంచార్జిల మార్పుపై సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ.. మార్పులతో కొంతమందికి బాధ, ఆవేదన ఉంటుందన్నారు. రాబోయే రోజుల్లో అన్ని సర్దుకుంటాయన్నారు. ప్రజలకు ఎం చెప్పామో అదే చేస్తున్నాం.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలో వచ్చినప్పుడు బాధ్యతగానే పని చేసామంటూ పేర్కొన్నారు. ఎమ్మెల్యేలకు, ఇంచార్జిలను సీటు ఇవ్వలేమమని ఎప్పుడూ సీఎం చెప్పలేదన్నారు. ప్రజల్లోకి వెళ్ళాలని, ప్రజల మద్దతు పొందాలని సీఎం చెప్పారు.. సిట్టింగ్ ల మార్పులు అనేది ఎన్నికలు ముందు జరిగే సాధారణ ప్రక్రియ.. దానిపై ప్రతిపక్షాలు ఏవేవో మాట్లాడుతున్నాయంటూ సజ్జల ఫైర్ అయ్యారు. ఎప్పుడు ఎన్నికలకు వచ్చినా సిద్ధంగా ఉన్నామన్న సజ్జల.. నోటిఫికేషన్ కోసం తాము ఎదురు చూడడం లేదంటూ క్లారిటీ ఇచ్చారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..