ఏపీ హైకోర్టులో పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి మరో పిటిషన్.. ఈసీ, డీజీపీకి కీలక ఆదేశాలు..
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు మాచర్ల నియోజకవర్గం హాట్ టాపిక్‌గా మారింది. పిన్నెల్లి పేరు తెగ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే విచారణ అధికారులను మార్చాలని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏపీ హైకోర్టులో మరో పిటిషన్ వేశారు. పిన్నెల్లి లేఖను పరిగణనలోకి తీసుకుని.. రేపటిలోగా ఆర్డర్స్ ఇవ్వాలని ఈసీ, డీజీపీకి ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం ఆసక్తిగా మారింది. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏపీ హైకోర్టులో మరో పిటిషన్ వేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు మాచర్ల నియోజకవర్గం హాట్ టాపిక్‌గా మారింది. పిన్నెల్లి పేరు తెగ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే విచారణ అధికారులను మార్చాలని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏపీ హైకోర్టులో మరో పిటిషన్ వేశారు. పిన్నెల్లి లేఖను పరిగణనలోకి తీసుకుని.. రేపటిలోగా ఆర్డర్స్ ఇవ్వాలని ఈసీ, డీజీపీకి ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం ఆసక్తిగా మారింది. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏపీ హైకోర్టులో మరో పిటిషన్ వేశారు. ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తనపై నమోదైన కేసులకు సంబంధించి విచారణ అధికారులను మార్చాలని కోరుతూ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా.. విచారణకు అనుమతించింది. తనపై నమోదైన కేసుల్లో దర్యాప్తు అధికారులు తనను టార్గెట్ చేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు పిన్నెల్లి. దాంతో.. ఆయన వినతిపై రేపటికల్లా నిర్ణయాన్ని వెలువరించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా దర్యాప్తు అధికారులతో పాటు ఐజీని కూడా మార్చాలంటూ పిటిషన్‌లో పిన్నెల్లి కోరారు. ఈ క్రమంలోనే.. పిన్నెల్లి లేఖను పరిగణనలోకి తీసుకోవాలని ఈసీ, డీజీపీకి ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది.
దీనికి సంబంధించి రేపటిలోగా ఆర్డర్స్ ఇవ్వాలని ఈసీ, డీజీపీకి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇదిలావుంటే.. హైకోర్టు ఆదేశాలతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పల్నాడులోకి ఎంట్రీ ఇచ్చారు. ఎట్టకేలకు పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికాగార్గ్‌ను కలిశారు. మే 29 అర్థరాత్రి పన్నెండు గంటల సమయంలో తన లాయర్లతో కలిసి పల్నాడు ఎస్పీ ముందు హాజరయ్యారు. హైకోర్టు ఆదేశాల మేరకు అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించారు. నరసరావుపేటలో నివాసం ఉండే ఇంటి అడ్రస్‌తోపాటు ఫోన్ నెంబర్‌ను ఎస్పీకి అందజేశారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఎన్నికల అల్లర్ల కేసుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ ఇచ్చిన ఏపీ హైకోర్టు.. పలు షరతులు విధించింది. ఆ కండీషన్స్‌లో భాగంగానే ఎస్పీ ముందు హాజరయ్యారు పిన్నెల్లి. ప్రతిరోజూ జిల్లాఎస్పీకి రిపోర్ట్ చేయాలని, కౌంటింగ్ రోజు రిటర్నింగ్ అధికారికి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. అలాగే.. పాస్‌పోర్టు కోర్టుకు సరెండర్ చేసి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోనే ఉండాలని చెప్పింది. కార్యకర్తలను కంట్రోల్‌లో పెట్టడంతోపాటు.. ఎక్కడ ఉంటారో అడ్రస్, మొబైల్ నంబర్ ఇవ్వాలంది. హైకోర్టు ఆదేశాలతో పల్నాడు ఎస్పీకి వివరాలు అందజేశారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. తన లాయర్ ద్వారా పాస్‌పోర్టును కోర్టులో అప్పగించి.. పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలోని రిజిష్టర్‌లో సంతకం చేసి వెళ్లిపోయారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..