Hanuman Jayanti: నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు.. పోటెత్తిన భక్తులు

అనంతపురం జిల్లా కసాపురంలో హనుమాన్‌ జయంతి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఐదు రోజులపాటు జరిగే వేడుకల్లో భాగంగా.. మూడో రోజు డ్రైఫ్రూట్స్‌ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు నెట్టికంటి ఆంజనేయుడు. తొలిరోజు పుష్పాలంకరణ, రెండో రోజు గంధాలంకరణ, మూడో రోజు డ్రైఫ్రూట్స్‌ అలంకరణ, నాలుగో రోజు వివిధ రకాల పండ్లతో అలంకరణ, 108 కలశాలతో అభిషేక సేవ, ఐదో రోజు స్వర్ణ వజ్రకవచ అలంకరణలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.

Hanuman Jayanti: నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు.. పోటెత్తిన భక్తులు
Hanuman Jayanti
Follow us

|

Updated on: May 31, 2024 | 6:28 AM

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో ప్రముఖ పుణ్యక్షేత్రాలు కొలువై ఉన్నాయి. ప్రతి పుణ్యక్షేత్రానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు, చరిత్ర ఉంది. ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలోని నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయం కూడా ప్రధానమైనదిగా చెప్పొచ్చు. నెట్టికంటి హనుమాన్‌ను నిత్యం వేలాదిమంది భక్తులు దర్శించుకుంటుంటారు. ఈ క్రమంలోనే.. కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఐదు రోజుల పాటు జరిగే జయంతి ఉత్సవాల్లో ఒక్కో రోజు ఒక్కో అలంకరణతో అలరిస్తారు నెట్టికంటి ఆంజనేయుడు. తొలిరోజు పుష్పాలంకరణ, రెండో రోజు గంధాలంకరణ, మూడో రోజు డ్రైఫ్రూట్స్‌ అలంకరణ, నాలుగో రోజు వివిధ రకాల పండ్లతో అలంకరణ, 108 కలశాలతో అభిషేక సేవ, ఐదో రోజు స్వర్ణ వజ్రకవచ అలంకరణలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. దీనిలో భాగంగా.. మూడో రోజు ప్రత్యేకంగా డ్రై ఫ్రూట్ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు నెట్టికంటి ఆంజనేయుడు.

హనుమాన్‌ జయంతి ఉత్సవాల్లో మూడవ రోజు ఆలయ వేద పండితులు, అర్చకులు ఆంజనేయస్వామిని డ్రై ఫ్రూట్స్‌తో ప్రత్యేకంగా అలంకరించారు. ద్రాక్ష, గోడంబి, ఖర్జూరం, చెర్రీ, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్‌తో స్వామివారిని అలంకరించడంతో భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రత్యేక అలంకరణలోనున్న నెట్టికంటి ఆంజనేయస్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. మూడో రోజులో భాగంగా.. ఉదయం ప్రత్యేక అలంకరణ తర్వాత సుందరకాండ పారాయణం, మన్య సూక్త హోమం నిర్వహించారు వేద పండితులు. సాయంత్రం సింధూరంతో లక్ష అర్చన చేపట్టారు.

ఇవి కూడా చదవండి

నాలుగో రోజులో భాగంగా ఇవాళ వివిధ రకాల పండ్లతో అలంకరణ, 108 కలశాలతో అభిషేక సేవ, రేపు ఐదో రోజున హనుమాన్‌ జయంతి సందర్భంగా స్వర్ణ వజ్రకవచ అలంకరణలో స్వామివారు భక్తులను కటాక్షించనున్నారు. ఇక.. కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామివారి ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు దేవదాయ శాఖ అధికారులు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అలర్ట్.. హైదరాబాద్, విజయవాడలో బంగారం రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?
అలర్ట్.. హైదరాబాద్, విజయవాడలో బంగారం రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?
వారి సంపాదన ఇబ్బడిముబ్బడిగా పెరుగే ఛాన్స్..
వారి సంపాదన ఇబ్బడిముబ్బడిగా పెరుగే ఛాన్స్..
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు..తెలుగు కుర్రాడికి స్థానం
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు..తెలుగు కుర్రాడికి స్థానం
ప్రియురాలిని పరిచయం చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్ నబీల్.. ఫొటోస్
ప్రియురాలిని పరిచయం చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్ నబీల్.. ఫొటోస్
సుకుమార్ వాట్సాప్ డీపీగా ఎవరి ఫొటో పెట్టుకున్నారో తెలుసా?
సుకుమార్ వాట్సాప్ డీపీగా ఎవరి ఫొటో పెట్టుకున్నారో తెలుసా?
ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన
ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన
BSNL వినియోగదారులకు శుభవార్త.. ఈ ప్లాన్‌లో మార్పు.. మరింత డేటాను
BSNL వినియోగదారులకు శుభవార్త.. ఈ ప్లాన్‌లో మార్పు.. మరింత డేటాను
సర్ఫరాజ్ ఖాన్ సోదరుడి ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల
సర్ఫరాజ్ ఖాన్ సోదరుడి ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల
రాష్ట్రపతికి మంత్రి సీతక్క అరుదైన కానుక..!
రాష్ట్రపతికి మంత్రి సీతక్క అరుదైన కానుక..!
ఆదివారం బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కోసం పింక్ పవర్ రన్..
ఆదివారం బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కోసం పింక్ పవర్ రన్..
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
పేలిపోయిన చైనా రాకెట్‌.! నేలపై దిగడానికి ముందు.. వీడియో వైరల్.
పేలిపోయిన చైనా రాకెట్‌.! నేలపై దిగడానికి ముందు.. వీడియో వైరల్.
ఇంట్లోకి దూరి ఐఫోన్ కొట్టేసి.. సెల్ టవర్ ఎక్కిన కోతి.ఆపై ట్విస్ట్
ఇంట్లోకి దూరి ఐఫోన్ కొట్టేసి.. సెల్ టవర్ ఎక్కిన కోతి.ఆపై ట్విస్ట్
వెరీ స్మార్ట్‌.! ఆటోవాలా నా మజాకా.. ‘పీక్ బెంగళూరు’కి ఉదాహరణ.
వెరీ స్మార్ట్‌.! ఆటోవాలా నా మజాకా.. ‘పీక్ బెంగళూరు’కి ఉదాహరణ.
నిద్ర లేచేసరికి హాయ్ అంటూ సింహం ఎదురొస్తే.! అదిరిపోయే వీడియో..
నిద్ర లేచేసరికి హాయ్ అంటూ సింహం ఎదురొస్తే.! అదిరిపోయే వీడియో..
ఇజ్రాయెల్‌ దాడిలో హమాస్‌ చీఫ్‌ మృతి.? ఆధారాలు లభించలేదని వెల్లడి.
ఇజ్రాయెల్‌ దాడిలో హమాస్‌ చీఫ్‌ మృతి.? ఆధారాలు లభించలేదని వెల్లడి.
రైల్లోని ఏసీ కోచ్‌లో వింత శబ్దాలు.. ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ లో పాము.
రైల్లోని ఏసీ కోచ్‌లో వింత శబ్దాలు.. ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ లో పాము.
చందమామపై బయటపడ్డ భారీ బిలం.! ఏకంగా 160 కిలోమీటర్ల వెడల్పు..
చందమామపై బయటపడ్డ భారీ బిలం.! ఏకంగా 160 కిలోమీటర్ల వెడల్పు..
అరకు పొలంలో నీటిని చిమ్ముతూ సుడిగాలి బీభత్సం.. వీడియో వైరల్.
అరకు పొలంలో నీటిని చిమ్ముతూ సుడిగాలి బీభత్సం.. వీడియో వైరల్.
చిత్ర పరిశ్రమలో వేధింపులు.. బాధితులకు ఐశ్వర్య రాజేశ్‌ సలహా ఇదే.!
చిత్ర పరిశ్రమలో వేధింపులు.. బాధితులకు ఐశ్వర్య రాజేశ్‌ సలహా ఇదే.!