Vastu Tips: ఇంట్లో రామ చిలుకను ఉంచడం శుభమా, అశుభమా? వాస్తుప్రకారం ఏ దిశలో ఉంచడం శ్రేయష్కరం అంటే..

కొంతమందికి రామ చిలుకలంటే చాలా ఇష్టం. అయితే ఇలా రామ చిలుకను ఇంట్లో పెంచుకోవడం శుభమా అశుభమా అని ప్రజలు ఆలోచిస్తూ ఉంటారు. వాస్తు శాస్త్రంలో కూడా ఈ రామ చిలుకల పెంపకానికి సంబంధించిన అనేక నియమాలు పేర్కొనబడ్డాయి. వాస్తు నియమాల ప్రకారం రామ చిలుకను ఇంట్లో పెంచుకోవడం వల్ల సుఖ సంతోషాలు పెరుగుతాయని నమ్ముతారు. అయితే రామ చిలుకను ఇంట్లో పెంచుకోవానికి కూడా కొన్ని వాస్తు నియమాలు ఉన్నాయి. అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం...

Vastu Tips: ఇంట్లో రామ చిలుకను ఉంచడం శుభమా, అశుభమా? వాస్తుప్రకారం ఏ దిశలో ఉంచడం శ్రేయష్కరం అంటే..
Vastu Tips For Parrot
Follow us
Surya Kala

|

Updated on: May 27, 2024 | 8:02 AM

ఇంట్లో కుక్క, పిల్లి, చేపలు, కుందేలు, చిలుకలతో సహా రకరకాల జంతువులను పెంపుడు పక్షులను పెంచుకోవడానికి చాలా మంది ఆసక్తిని చూపిస్తారు. కోడి, ఆవు, మేక వంటి వాటిని ఇంటి బయట పెడితే.. కుక్క, పిల్లి, రామ చిలుక వంటి వంటిని ఇంట్లో పెట్టి పెంచుకుంటారు. వీటిని పెంచుకోవడం వలన మానసిక ప్రసాంతత ఉంటుందని.. ఇంట్లో సానుకూల వాతావరణం ఉంటుందని ప్రజలు నమ్ముతారు. కొంతమందికి రామ చిలుకలంటే చాలా ఇష్టం. అయితే ఇలా రామ చిలుకను ఇంట్లో పెంచుకోవడం శుభమా అశుభమా అని ప్రజలు ఆలోచిస్తూ ఉంటారు. వాస్తు శాస్త్రంలో కూడా ఈ రామ చిలుకల పెంపకానికి సంబంధించిన అనేక నియమాలు పేర్కొనబడ్డాయి. వాస్తు నియమాల ప్రకారం రామ చిలుకను ఇంట్లో పెంచుకోవడం వల్ల సుఖ సంతోషాలు పెరుగుతాయని నమ్ముతారు. అయితే రామ చిలుకను ఇంట్లో పెంచుకోవానికి కూడా కొన్ని వాస్తు నియమాలు ఉన్నాయి. అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం…

రామ చిలుకను పెంచడం ఉంచడం శుభమా, అశుభమా?

  1. వాస్తు ప్రకారం ఇంటికి ఉత్తరం లేదా తూర్పు దిశలో రామ చిలుకను ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.
  2. రామ చిలుకను పంజరంలో ఉంచినట్లయితే.. అది ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేలా చూసుకోండి. పంజరంలో చిలుక సంతోషంగా లేకుంటే ప్రతికూలత పెరుగుతుందని నమ్ముతారు.
  3. అంతే కాకుండా ఇంట్లో రామ చిలుక బొమ్మను ఉంచడం కూడా చాలా శ్రేయస్కరం. ఇది జాతకంలో ఉన్న గ్రహ దోషాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
  4. ఇంట్లోకి రామ చిలుకను తీసుకువచ్చేటప్పుడు.. దాని పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఇలా చేయడం వల్ల చాలా శుభ ఫలితాలు లభిస్తాయని, జీవితంలో ఆనందం కలుగుతుందని నమ్ముతారు.

చిలుకను ఏ పరిస్థితుల్లో ఉంచడం శ్రేయస్కరం?

  1. ఇంట్లో చిలుకను ఉంచడం వల్ల రాహు-కేతు, శని గ్రహాల దుష్ప్రభావాలు తగ్గుతాయని నమ్ముతారు.
  2. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చిలుకను ఇంట్లో ఉంచడం వల్ల వ్యాధులు, దోషాల నుంచి ఉపశమనం లభిస్తుంది.
  3. రామ చిలుకను ఉంచుకోవడం వల్ల పిల్లలు చదువుపై ఏకాగ్రత పెంచుతారు.
  4. ఇంట్లో చిలుకను ఉంచడం వల్ల భార్యాభర్తల మధ్య అనుబంధం మెరుగుపడుతుంది.

చిలుకను ఏ పరిస్థితుల్లో ఉంచడం అశుభం?

  1. రామ చిలుక సంతోషంగా లేని పక్షంలో ఇంట్లో తరచుగా ఇంట్లో ఇబ్బందులు తలెత్తుతాయని నమ్ముతారు.
  2. కుటుంబ సభ్యులు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు.
  3. ఇంట్లో గొడవలు జరిగినప్పుడు రామ చిలుక పదే పదే మాట్లాడితే అది కూడా అశుభ సంకేతంగా పరిగణించబడుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు