Padmanabhaswamy Temple: ఈ ఆలయంలోని 7వ నేలమాళిగ రహస్యం ఏమిటి? ఈ తలుపు ఎందుకు తెరవరంటే

ఆరు తలుపులు తెరిచిన తర్వాత ఏడవ తలుపు తెరవడంపై చాలా వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకుని ఏడో తలుపు తెరవడంపై నిషేధాజ్ఞలను విధించింది. ఆలయ ఏడవ తలుపు చెక్కతో చేయబడింది. ఈ తలుపు మీద ఒక పెద్ద పాము బొమ్మ చెక్కబడి ఉంది. దీంతో తలుపులు తెరిచే ప్రయత్నం ఆగిపోయింది. ఈ ద్వారానికి శ్రీ మహావిష్ణువు పాన్పు అయిన శేషుడు కాపలాగా ఉన్నాడని నమ్ముతారు. ఈ తలుపు తెరవడంపై వివాదం నెలకొంది. అంతేకాదు ఈ తలపు తెరిస్తే భారీ విపత్తుకు దారి తీస్తుందని నమ్మకం.

Padmanabhaswamy Temple: ఈ ఆలయంలోని 7వ నేలమాళిగ రహస్యం ఏమిటి? ఈ తలుపు ఎందుకు తెరవరంటే
Padmanabhaswamy Temple
Follow us

|

Updated on: May 27, 2024 | 7:53 AM

భారతదేశం ఆధ్యాత్మికతకు నెలవు. కొండకోనలతో పాటు అనేక ప్రాంతాల్లో ఆలయాలున్నాయి. కొన్ని స్వయంభువుగా వెలసిన ఆలయాలు అయితే.. మరికొన్ని మనవ నిర్మాత ఆలయాలు. అయితే ఏ ఆలయానికి ఆ ఆలయమే దాని ప్రత్యేకత ను నిలబెట్టుకుని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. అయితే కొన్ని దేవాలయాలు నేటికీ సైన్స్ చేధించని రహస్యాలకు నెలవు. అటువంటి ఆలయాల్లో ప్రపంచప్రసిద్దిగాంచింది కేరళలలోని అనంత పద్మనాభస్వామి దేవాలయం ఒకటి. ఈ ఆలయంలోని రహస్య నిధి బయల్పడడంతో భారతదేశంలోని అత్యంత ధనిక దేవాలయాల్లో ఒకటిగా ఖ్యాతిగాంచింది. అయితే ఈ ఆలయంలోని నేలమాళిగ నేటికి ఒక చేధించని మిస్టరీగా నిలిచిపోయింది.

పద్మనాభస్వామి ఆలయ ప్రత్యేకతలు కేరళలోని త్రివేండ్రంలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం అతిపెద్ద ప్రత్యేకత ఏమిటంటే అత్యంత ధనిక దేవాలయంగా పరిగణించబడుతుంది. ఆలయ ఖజానాలో వజ్రాలు, బంగారు ఆభరణాలు, బంగారంతో చేసిన విగ్రహాలు ఉన్నాయి. ఆలయంలోని 6 నేలమాళిగలలో 20 బిలియన్‌ డాలర్ల విలువైన ఆస్తులు ఉన్నాయని చెబుతున్నారు. ఆలయంలోని మహావిష్ణువు విగ్రహం బంగారంతో చేయబడింది. ఈ విగ్రహం ఖరీదు దాదాపు రూ.500 కోట్లు. అంతేకాదు దేవుడికి వేల బంగారు గొలుసులు ఉన్నాయి. వీటిలో ఒక బంగారు గొలుసు 18 అడుగుల పొడవు ఉంటుంది. అదే సమయంలో.. దేవుని తెర కూడా 36 కిలోల బంగారంతో చేయబడి ఉంది.

6 నేలమాళిగల్లో అపారమైన సంపద ఈ ఆలయ రహస్య నేలమాళిగలో అపారమైన సంపద దాగి ఉంది. ఆలయంలో 7 రహస్య నేలమాళిగలు ఉన్నాయి. ప్రతి నేలమాళిగకు దానితో అనుసంధానించబడిన తలుపు ఉంటుంది. 2011లో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఆరు నేలమాళిగలను ఒకదాని తర్వాత ఒకటిగా తెరవ బడ్డాయి. ఇందులో లెక్కలేనంత నిధి దాగి ఉంది. మొత్తంగా ఇక్కడ ఆలయ ట్రస్టు వద్ద ఉంచిన రూ.లక్ష కోట్లకు పైగా విలువైన బంగారు, వజ్రాభరణాలను గుర్తించారు.

ఇవి కూడా చదవండి

ఏడవ తలుపు రహస్యం ఆరు తలుపులు తెరిచిన తర్వాత ఏడవ తలుపు తెరవడంపై చాలా వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకుని ఏడో తలుపు తెరవడంపై నిషేధాజ్ఞలను విధించింది. ఆలయ ఏడవ తలుపు చెక్కతో చేయబడింది. ఈ తలుపు మీద ఒక పెద్ద పాము బొమ్మ చెక్కబడి ఉంది. దీంతో తలుపులు తెరిచే ప్రయత్నం ఆగిపోయింది. ఈ ద్వారానికి శ్రీ మహావిష్ణువు పాన్పు అయిన శేషుడు కాపలాగా ఉన్నాడని నమ్ముతారు. ఈ తలుపు తెరవడంపై వివాదం నెలకొంది. అంతేకాదు ఈ తలపు తెరిస్తే భారీ విపత్తుకు దారి తీస్తుందని నమ్మకం.

ప్రత్యేక మంత్రాలతో తలుపులు తెరవబడతాయి ఆలయంలోని ఈ ఏడవ ద్వారం కొన్ని మంత్రాలను పఠించడం ద్వారా మూసివేయబడిందని.. ఇప్పుడు దీనిని ఎవరూ తెరవలేరని నమ్ముతారు. తలుపు మీద ఉన్న పాముల ఆకారాన్ని చూస్తే, నిపుణులు దీనిని నాగ పాశం వంటి ఏదైనా మంత్రంతో ముసి వేసి ఉంటారని.. దీనిని ఇప్పుడు తెరవాలంటే గరుడ మంత్రాన్ని పఠించాల్సి ఉంటుందని పండితులు భావిస్తున్నారు, అయితే తలుపు తెరచే ఈ మంత్రాలు చాలా కష్ట తరం అని విశ్వాసం. తలుపు తెరిచేందుకు చేసే ప్రయత్నం, పద్ధతిలో ఏ చిన్న పొరపాటు ఉన్నా అది ప్రాణాంతకం అవుతుందని భావిస్తున్నారు. అందుకనే ఇప్పటి వరకు ఎవరూ నేలమాళిగలోని ఏడవ గదిని తెరవడానికి సాహసించడం లేదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు
టమాటాలు అతిగా తిన్నారో మీ పని అంతే..! తస్మాత్‌ జాగ్రత్త
టమాటాలు అతిగా తిన్నారో మీ పని అంతే..! తస్మాత్‌ జాగ్రత్త
గర్భిణిని కత్తితో పొడిచిన సీరియల్‌ నటుడు.! గర్భ విచ్ఛిత్తి
గర్భిణిని కత్తితో పొడిచిన సీరియల్‌ నటుడు.! గర్భ విచ్ఛిత్తి
ఐటీఆర్ ఫైల్ చేసినా రీఫండ్ రాలేదా..? తనిఖీ చేయండిలా..!
ఐటీఆర్ ఫైల్ చేసినా రీఫండ్ రాలేదా..? తనిఖీ చేయండిలా..!
సెప్టెంబరు 5 నాటికి డీఎస్సీ నియామక పత్రాలు అందజేత
సెప్టెంబరు 5 నాటికి డీఎస్సీ నియామక పత్రాలు అందజేత
నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేసిన అవికా గోర్ దెయ్యం సినిమా
నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేసిన అవికా గోర్ దెయ్యం సినిమా
జాలరి పంట పండింది.. వలలో చిక్కిన బంగారు చేప.!
జాలరి పంట పండింది.. వలలో చిక్కిన బంగారు చేప.!