Vastu Tips: ఇంట్లో చీపురుని ఎక్కడ, ఏ దిక్కులో ఉంచితే మంచిది?

ఇంట్లో ఉండే వస్తువులను బట్టి దశ దిశ మారుతాయన్న విషయం చాలా మందికి తెలీదు. కొన్ని వస్తువులను కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల్లో ఉంచితే చాలా రకాల ప్రయోజనాలు చేకూరతాయి. వీటిల్లో చీపురు కూడా ఒకటి. ఇంటిని పరిశుభ్రంగా ఉంచే వాటిల్లో చీపురు ముఖ్య పాత్ర పోషిస్తుంది. చీపురును హిందూ మతంలో అత్యంత పవిత్రంగా భావిస్తారు. సాక్షాత్తూ లక్ష్మీ దేవి స్వరూపంగా భావిస్తూ ఉంటారు. చీపురులో లక్ష్మీ దేవి నివసిస్తుందని..

Vastu Tips: ఇంట్లో చీపురుని ఎక్కడ, ఏ దిక్కులో ఉంచితే మంచిది?
Vastu Tips
Follow us
Chinni Enni

|

Updated on: May 30, 2024 | 6:47 PM

ఇంట్లో ఉండే వస్తువులను బట్టి దశ దిశ మారుతాయన్న విషయం చాలా మందికి తెలీదు. కొన్ని వస్తువులను కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల్లో ఉంచితే చాలా రకాల ప్రయోజనాలు చేకూరతాయి. వీటిల్లో చీపురు కూడా ఒకటి. ఇంటిని పరిశుభ్రంగా ఉంచే వాటిల్లో చీపురు ముఖ్య పాత్ర పోషిస్తుంది. చీపురును హిందూ మతంలో అత్యంత పవిత్రంగా భావిస్తారు. సాక్షాత్తూ లక్ష్మీ దేవి స్వరూపంగా భావిస్తూ ఉంటారు. చీపురులో లక్ష్మీ దేవి నివసిస్తుందని నమ్ముతారు. అందుకే చీపురును ఇంట్లో సరైన ప్రదేశంలో పెట్టడం వల్ల కూడా మీపై లక్ష్మీ దేవి కటాక్షం అనేది పడుతుంది. చాలా మంది చీపురును ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటారు. ఇలా పెట్టడం వల్ల మీపై పలు సైడ్ ఎఫెక్ట్స్ పడొచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఆర్థిక సమస్యలను కూడా ఎదుర్కొనాల్సి వస్తుంది. మరి చీపురును ఎక్కడ? ఎలా పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.

చీపురు ప్రాముఖ్యత ఇదే:

చీపురును లక్ష్మీ దేవి స్వరూపంగా భావిస్తారు. ఇందులో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతూ ఉంటారు. అందుకే చీపురును పొరపాటున కూడా తొక్కకూడదని అంటారు. ఒకవేళ తొక్కినా విసిరినా లక్ష్మీ దేవిని అవమానించినట్టే అవుతుంది. కాబట్టి చీపురు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

చీపురును నిలువుగా ఉంచొద్దు:

చాలా మంది చీపురును నిలువుగా పెడుతూ ఉంటారు. ఇలా అస్సలు పెట్టకూడదట. ఇలా పెట్టడం వల్ల లక్ష్మీ దేవి మీ ఇంట్లోకి ప్రవేశించదు. దీని వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుంది.

ఇవి కూడా చదవండి

ఈ దిశలో ఉంచితే బెటర్:

చీపురును ఇంటికి పడమర దిశలో ఉంచడం వల్ల చాలా మంచిది. వాస్తు ప్రకారం.. పడమర దిక్కు శుభ ఫలితాలను ఇస్తుంది. ఆర్థిక సమస్యలు రాకుండా కాపాడుతుంది. కాబట్టి పడమర దిక్కులో చీపురును పెడితే.. ఆర్థికంగా బలపడతారు. అలాగే చీపురుని నిలబెట్టకుండా పడుకోబెట్టండి. మంచం కింద చీపురు అస్సలు ఉంచకూడదు.

ఎవరికీ కనిపించని ప్రదేశంలో ఉంచాలి:

చాలా మంది చీపుర్లను ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటారు. ఇల్లు ఊడ్చిన తర్వాత చీపుర్లను ఎవరికీ కనిపించని ప్రదేశంలో పెట్టాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. చీపుర్లను అందరికీ కనిపించే ప్రదేశంలో పెడితే.. పాజిటివ్ ఎనర్జీ తగ్గి.. నెగిటీవ్ ఎనర్జీ పెరుగుతుంది. అదే విధంగా విరిగిపోయిన చీపురును ఇంట్లో ఉంచకూడదు.