Andhra: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి రెయిన్ అలెర్ట్..
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినది. వాయుగుండం రీతిలో 36 గంటల్లో బలవంతంగా పెరగవచ్చు అని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ అల్పపీడనం పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూనే ఏంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వర్షపాతం కలిగించే అవకాశం ఉంది. .. ..

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది రాబోయే 36 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ నైరుతి,దానిని ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ వాయుగుండం ప్రభావం ఏపీ దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలపై అధికంగా ఉంటుంది.
ఈ పరిస్థితుల కారణంగా మంగళవారం ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇక బుధవారం రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేయనున్నట్లు తెలిపారు. తీర ప్రాంతాల్లో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు. మత్స్యకారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. శిథిలావస్థలో ఉన్న గోడలు, ఇళ్లు, ఇతర భవనాల కింద నిల్చోకూడదని హెచ్చరించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




