Andhra: తీరానికి భారీ కళేబరం.. చూసి అంతా షాక్.. ఏంటో తెలుసా..!
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం తీనార్ల సముద్ర తీరానికి భారీ తిమింగలం కర్రెక్కి తీరానికి వాలింది. దాదాపు వంద అడుగుల పొడవున్న ఈ తిమింగలం మృతి చెంది చేరింది. అటుగా వెళుతున్న మత్స్యకారులు, భారీ కాయంతో ఉన్న చేపను చూసి షాక్ అయ్యారు.

అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం తీనార్ల సముద్ర తీరానికి భారీ తిమింగలం తూర్పుగా కాస్త పొడవైన కళేబరంతో తీరానికి కొట్టుకొచ్చింది. దాదాపు వంద అడుగుల పొడవున్న ఈ తిమింగలం మృతి చెందిన స్థితిలో కనుగొన్నారు. ఆ ప్రాంతంలో వెళ్తున్న మత్స్యకారులు మొదటే భయంతో ఆశ్చర్యపోయారు. భారీ కాయంతో ఉన్న ఈ తిమింగలం చూసి అవాక్కయ్యారు. ప్రాణంతో ఉందేమోనని నీటిలోకి తిరిగి పంపేందుకు ప్రయత్నించారు. కానీ చలనం లేకపోవడంతో అది మృతి చెందిదని నిర్ధారించారు.
ఈ ఘటనపై సమాచారం తెలిసిన ప్రజలు భారీ తిమింగలాన్ని ప్రత్యక్షంగా చూడటానికి పెద్ద ఎత్తున చేరుతున్నారు. మత్స్యశాఖ అధికారులు తిమింగలాన్ని పరిశీలిస్తున్నారు. గతంలో ఇంత భారీ కాయంతో ఉన్న తిమింగలాన్ని చూడలేనిజజ. సముద్రంలో భారీ నౌక ఢీకొనడం వల్ల అది మృతి చెంది ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




