AP Inter Pass Percentage Marks 2025: ఇంటర్మీడియట్ పాస్ మార్కుల విధానంలో కీలక మార్పులు.. 30 శాతం వచ్చినా పాసైనట్లే!
రాష్ట్ర ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఈసాకి కాస్త ముందుగానే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చ ఏడాది ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు మొదలవనున్నాయి. మరోవైపు ఇంటర్ పరీక్షల ఫీజు గడువు అక్టోబర్ 22వ తేదీతో ముగియనుంది. ఆ తర్వాత..

అమరావతి, అక్టోబర్ 21: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఈసాకి కాస్త ముందుగానే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చ ఏడాది ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు మొదలవనున్నాయి. మరోవైపు ఇంటర్ పరీక్షల ఫీజు గడువు అక్టోబర్ 22వ తేదీతో ముగియనుంది. ఆ తర్వాత రూ.1,000 ఆలస్య రుసుముతో అక్టోబర్ 30 వరకు ఫీజు చెల్లింపుకు అవకాశం కల్పిస్తున్టన్లు ఇంటర్మీడియట్ బోర్డు ఇటీవల తెలపింది. థియరీ పేపర్లకు రూ.600, ప్రాక్టికల్స్‌కు రూ.275, బ్రిడ్జికోర్సు సబ్జెక్టుకు రూ.165 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అయితే 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ విద్యార్థుల పాస్ పర్సంటేజీ, పాస్ మార్కుల విధానంలోనూ కీలక మార్పులు రానున్నాయి. ఈ మేరకు తాజాగా ఇంటర్ బోర్డు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వుల ప్రకారం ఇంటర్ జాగ్రఫీ పేపర్ మార్కుల విధానంలో గతంలో మాదిరి 35 శాతం మార్కులు రావల్సిన అవసరం లేదు. ఇకపై కనీసం 30 మార్కులు వచ్చినా ఉత్తీర్ణత పొందినట్లుగానే పరిగణిస్తారు. అదెలాగంటే..
2025-26 విద్యా సంవత్సరంలో ఫస్ట్ ఇయర్ రెగ్యులర్ విద్యార్థులకు జాగ్రఫీ ప్రశ్నపత్రం 75 మార్కులకు ఉంటుంది. దీన్ని 85 మార్కులకు చేశారు. కొత్త మార్పులతో జాగ్రఫీని ఎలెక్టివ్ (ఛాయిస్) సబ్జెక్టుగా పరిగణిస్తారు. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రంతో సమానంగా ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. అంటే జాగ్రఫీ ప్రాక్టికల్ పరీక్షలను 50 మార్కులకు బదులు 30 మార్కులకు నిర్వహిస్తారు. ఈ ప్రాక్టికల్ పరీక్షలో కనీసం 35 శాతం అంటే 11 మార్కులు రావాల్సి ఉంటుంది. దీన్ని 30%కి తగ్గించడంతో 9 మార్కులు వస్తే ఉత్తీర్ణత పొందినట్లుగా పరిగణిస్తారు. 2025-26 విద్యా సంవత్సరంలో రెగ్యులర్ అభ్యర్థులుగా ప్రవేశం పొందిన ఇంటర్ విద్యార్థులకు మాత్రమే ఇది వర్తిస్తుంది.

కాగా ఇంటర్ పబ్లిక్ పరీక్షల మార్కుల విధానంలో బోర్డు చేసిన మార్పులను ఈ కింద చెక్ చేసుకోండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




