Andhra Pradesh: రొయ్యల ప్రాసెసింగ్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా గ్రామస్తుల ఆందోళన.. జోరు వానను లెక్క చేయకుండా..
Ambedkar Konaseema: సాధారణంగా ఏదైనా కంపెనీ వస్తే ఉపాధి లభిస్తుందని ఆశిస్తారు ప్రజలు. కానీ, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న ఫ్యాక్టరీనే తీసేయమంటూ జోరువానలో ఆందోళనకు దిగారు అక్కడి స్థానికులు.
Ambedkar Konaseema: సాధారణంగా ఏదైనా కంపెనీ వస్తే ఉపాధి లభిస్తుందని ఆశిస్తారు ప్రజలు. కానీ, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న ఫ్యాక్టరీనే తీసేయమంటూ జోరువానలో ఆందోళనకు దిగారు అక్కడి స్థానికులు. అసలా కంపెనీనే వద్దే వద్దంటూ జోరువానలో ఆందోళనకు దిగారు. జోరు వాన, మరోవైపు ఉరుములు మెరుపులతో పిడుగులు, అయినా వారు భయపడలేదు, తాము పడుతోన్న బాధ అందరికీ తెలిసేలా కుండపోత వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రోడ్డుపైకి వచ్చారు ప్రజలు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం పోతుకుర్రులో రొయ్యల ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరుబాట పట్టారు గ్రామస్తులు. రొయ్యల ఫ్యాక్టరీ వదులుతోన్న వ్యర్థాల దుర్వాసన భరించలేకపోతున్నామంటూ జోరువానలో ఆందోళనకు దిగారు. వాంతులు, విరేచనాలతో అనారోగ్యం బారినపడుతున్నామని వాపోతున్నారు. ఈ ఫ్యాక్టరీ తమకు వద్దే వద్దంటోన్న పోతుకుర్రు గ్రామస్తులు, వెంటనే ఇక్కడ్నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
అధికారులకు ఎన్నిసార్లు మొర్ర పెట్టుకున్నా, కంప్లైంట్ చేసినా పట్టించుకోవడం లేదంటున్నారు బాధితులు. తమ ఆవేదనను పట్టించుకోకుండా తిరిగి ఫ్యాక్టరీ మేనేజ్‌మెంట్‌కే కొమ్ముకాస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమ గ్రామం నుంచి రొయ్యల ఫ్యాక్టరీని తొలగించి తీరాల్సిందేనని, లేదంటే తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు పోతుకుర్రు గ్రామస్తులు.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..