AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Snake in Liquor Bottle: మద్యం తాగుదామనుకున్న యువకులకు షాక్.. మద్యం బాటిల్ లో పాము పిల్ల.. ఎక్కడంటే

మద్యం తాగేముందు బాటిల్‌ను ఒకసారి జాగ్రత్తగా చూడండి. లేదంటే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడవచ్చు.. ఎందుకంటే మద్యం సీసాలో పాము పిల్ల వచ్చింది. ఏంటి షాక్ తిన్నారా.. ఇది నిజం..

Snake in Liquor Bottle: మద్యం తాగుదామనుకున్న యువకులకు షాక్.. మద్యం బాటిల్ లో పాము పిల్ల.. ఎక్కడంటే
Snake Found In Liquor Bottl
Surya Kala
|

Updated on: Sep 11, 2022 | 9:31 AM

Share

Snake Found in Liquor Bottle: మద్యం తాగి ఛిల్ అవుదామని అనుకుంటారు కొందరు. సరదాకు మరికొందరు .. బాధలు మరచిపోతాం అంటూ ఇంకొందరు కిక్ కోసం ఇంకొందరు రకరకాల కారణాలతో మద్యం తాగుదామని ఫిక్స్ అయ్యారా? అయితే, ఒక్క సెకన్ ఆగండి.. మద్యం తాగేముందు బాటిల్‌ను ఒకసారి జాగ్రత్తగా చూడండి. లేదంటే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడవచ్చు.. ఎందుకంటే మద్యం సీసాలో పాము పిల్ల వచ్చింది. ఏంటి షాక్ తిన్నారా.. ఇది నిజం.. మద్యం తాగుదామనుకున్న యువకులకు సీసాలో పాము పిల్ల కనిపించింది. ఈ షాకింగ్ ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

ఇప్పటికే ఏపీలో మద్యంబాబులకు అనేక రకాల షాక్ లు తగులుతూనే ఉన్నాయి. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుపుతున్న మద్యం దుకాణాల్లో.. తక్కువ రకం మద్యం సరఫరా అవుతుందని వాపోతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పొన్నూరులోని బాపట్ల బస్టాండ్ వద్ద  ప్రభుత్వ మద్యం దుకాణం ఉంది. ఈ షాప్ లో కొందరు యువకులు శనివారం రాత్రి మద్యం సీసాలు కొనుగోలు చేశారు.

ఇంటికి వెళ్లి.. మద్యం తాగడం కోసం రెడీ అయిన యువకులు మద్యం సీసాను చూసి షాక్ తిన్నారు. ఎందుకంటే మద్యం సీసాలో పాము పిల్ల ఆ యువకులకు కనిపించింది. వెంటనే షాప్ దగ్గరకు వెళ్లి యువకులు షాప్ యజమానిని నిలదీశారు. తాము కొన్న మద్యం సీసాకు బదులుగా వేరేది ఇవ్వమని కోరారు. అయితే సిబ్బంది మొదట యువకుల డిమాండ్ ను నిరాకరించారు. దీంతో షాప్ దగ్గర యువకులకు సిబ్బందికి వాగ్వాదం చోటు చేసుకుంది. చివరికి షాప్ యాజమాన్యం రాజీకి వచ్చి.. కొత్త మద్యం బాటిల్ ను ఇచ్చి పంపించారు. ప్రస్తుతం ఈ మద్యం సీసాలో పాము పిల్ల న్యూస్ వైరల్ అయింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..