Village Sarpanch: ఓ మహిళా సర్పంచ్ పోరుబాట.. రోడ్లను ఊడుస్తూ వినూత్న నిరసన.. ఇంతకు ఆమె డిమాండ్ ఏమిటి?
Village Sarpanch: కర్నూలు జిల్లాలో ఓ మహిళా సర్పంచ్ పోరుబాట పట్టింది. తన గ్రామం కోసం దేనికైనా రెడీ అంటోంది. ఇంతకీ ఆమె పోరాటం ఎవరిపై? ఆమె డిమాండ్ ఏంటి? జిల్లాలోని..
Village Sarpanch: కర్నూలు జిల్లాలో ఓ మహిళా సర్పంచ్ పోరుబాట పట్టింది. తన గ్రామం కోసం దేనికైనా రెడీ అంటోంది. ఇంతకీ ఆమె పోరాటం ఎవరిపై? ఆమె డిమాండ్ ఏంటి? జిల్లాలోని ఆలూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ అరుణదేవి వినూత్నంగా నిరసన తెలిపారు. గ్రామంలో సమస్యలపై గళమెత్తారు. గ్రామాభివృద్ధి కోసం నిధుల్లేక ఇబ్బందులు పడుతున్నట్లు పోరుబాట పట్టారామె. ఆలూరు మేజర్ గ్రామ పంచాయతీకి నిధులు మంజూరు చేయాలంటూ పారిశుద్ధ్య కార్మికులతో కలిసి వీధుల్లో చెత్త ఊడ్చారు సర్పంచ్ అరుణ. నిధుల కొరతతో గ్రామంలో ఎలాంటి అభివృద్ధి చేయలేకపోతున్నామని, సమస్యలను తీర్చలేకపోతున్నామని అంటోంది సర్పంచ్ అరుణ.
ఆలూరు గ్రామ పంచాయతీకి వెంటనే నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారామె. తోపుడు బండిలో చెత్తను సేకరించే కార్మికులకు కూడా జీతాలు ఇవ్వలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు ఆలూరు సర్పంచ్ అరుణ. కొన్ని నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో పూట గడవడమే కష్టంగా మారిందని వాపోయారు. ఆలూరు గ్రామ పంచాయతీకి వెంటనే నిధులు ఇవ్వాలని, లేదంటే గ్రామంలో పరిస్థితి మరీ అధ్వాన్యంగా తయారయ్యే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తంచేస్తోంది సర్పంచ్ అరుణ.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ చదవండి