Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: ప్రేమించుకున్నారు.. పెద్దలను ఒప్పించారు.. తెల్లారితే ఎంగేజ్‌మెంట్..కట్ చేస్తే..

ప్రేమ ఎంగేజ్మెంట్ పెళ్లి అని చెప్పి మోసం చేసిన ప్రియుడి ఇంటి ముందు ఓ ప్రియురాలు నిరసన దీక్షకు దిగింది. తనకు మద్దతుగా న్యాయం చేయాలని ప్రజాసంఘాలు పోలీసులను వేడుకుంటుంది

Follow us
J Y Nagi Reddy

| Edited By: Velpula Bharath Rao

Updated on: Nov 16, 2024 | 8:07 PM

కర్నూలు జిల్లా ఆదోని హనుమాన్‌నగర్‌కు చెందిన ఈశ్వర్ ప్రసాద్, కర్ణాటకలోని మైసూర్‌కు చెందిన చందన బెంగళూరులోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఇద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఇద్దరు పెద్దలు కూర్చుని మాట్లాడుకున్నారు. ఈ నెల 14న ఎంగేజ్‌మెంట్ అని వచ్చే నెల 6న పెళ్లి అని నిర్ణయించుకున్నారు. పెళ్లికి పెద్దలు కూడా అంగీకరించినందున ఎంగేజ్‌మెంట్ వారం రోజుల ముందే ఆదోనిలోని అబ్బాయి ఇంటికి ప్రేమజంట చేరుకుంది. అయితే 14వ తేదీకి ముందే ప్రియుడు ఈశ్వర్ ప్రసాద్, అతని కుటుంబీకులు ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఇంట్లో చందన మాత్రమే ఉంది. ఎక్కడికెళ్లారో తెలీదు. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారు. ఒకవేళ మోగినా కూడా ఎత్తడం లేదు. 14వ తేదీ కూడా పూర్తయింది. ఎంగేజ్మెంట్ డేట్ అయిపోవడంతో ఆందోళనకు గురైంది చందన.. చేసేదేమి లేక ప్రియుడు ఇంటి ముందే చందన నిరసన దీక్షకు దిగింది. స్థానికంగా ఉన్న ఒక మహిళ అడ్వకేట్ ఆమెకు సపోర్ట్ చేసింది. ఎంగేజ్‌మెంట్ ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని ఈశ్వర్ బెంగళూరు నుంచి ఆదోనికి తీసుకొచ్చి మోసం చేశారని చందన వాపోయింది. చందనకు న్యాయం జరగాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి