Andhra Pradesh: ఇంట్లో ప్రియుడు, ప్రియురాలు.. తెల్లారితే ఎంగేజ్‌మెంట్.. చివరకు ఏం జరిగిందంటే..

బెంగళూరులోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. పరిచయం ఏర్పడింది.. మాటలు కలిశాయి. కట్ చేస్తే.. ఇద్దరూ ప్రేమించుకున్నారు.. ఈ విషయాన్ని ఇరువురు ఇంట్లో చెప్పారు.. పెద్దలు పెళ్లికి ఓకే చెప్పారు.. ఎంగేజ్మేంట్ డేట్ ఫిక్స్ చేశారు.. ఓ వారం ముందే.. అమ్మాయి ప్రియుడు ఇంటికి వచ్చింది.. తెల్లారితే.. ఎంగేజ్‌మెంట్ అనగా.. ప్రియుడు, అతని కుటుంబం మాయమైపోయారు.. దీంతో ఆ యువతి..

Andhra Pradesh: ఇంట్లో ప్రియుడు, ప్రియురాలు.. తెల్లారితే ఎంగేజ్‌మెంట్.. చివరకు ఏం జరిగిందంటే..
Woman Protested Infront Of Her Boyfriend House
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 16, 2024 | 1:45 PM

ప్రేమ.. ఎంగేజ్మెంట్.. పెళ్లి అని చెప్పి మోసం చేసిన ప్రియుడి ఇంటి ముందు ఓ ప్రియురాలు నిరసన దీక్షకు దిగింది. తనకు న్యాయం చేయాలని ఆ యువతి పోలీసులను వేడుకుంటుంది. ఆమెకు ప్రజాసంఘాలు మద్దతు తెలపడంతోపాటు.. ఆమెతోపాటు దీక్షకు దిగడం కర్నూలులో సంచలనంగా మారింది.. వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా ఆదోని హనుమాన్ నగర్ కు చెందిన ఈశ్వర్ ప్రసాద్, కర్ణాటకలోని మైసూర్‌కు చెందిన చందన.. బెంగళూరులోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఆఫీస్ లో ఇద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఇరువురు ఇళ్లల్లో ఈ విషయాన్ని చెప్పారు.. దీంతో పెద్దలు కూర్చుని మాట్లాడుకున్నారు. ఈ నెల 14న ఎంగేజ్మెంట్ అని, వచ్చే నెల 6న పెళ్లి అని నిర్ణయించుకున్నారు.

ప్రేమ పెళ్లికి పెద్దలు కూడా అంగీకరించడంతోపాటు.. ఎంగేజ్‌మెంట్ వారం రోజుల ముందే ఆదోనిలోని అబ్బాయి ఇంటికి యువతి వచ్చింది.. అయితే, ఈ క్రమంలోనే ఎంగేజ్‌మెంట్ సమయానికి అంటే.. 14వ తేదీకి ముందే చందనకు తెలియకుండా.. ఆమె ప్రియుడు ఈశ్వర్ ప్రసాద్, అతని కుటుంబీకులు ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఆ సమయంలో ఇంట్లో చందన మాత్రమే ఉంది. ఎక్కడికెళ్లారో తెలీదు. ఫోన్లు స్విచ్ ఆఫ్.. ఒకవేళ ఫోన్ రింగ్ అయినా కూడా ఎత్తడం లేదు.

వీడియో చూడండి..

ఇలా 14వ తేదీ కూడా వెళ్లిపోయింది.. ఎంగేజ్మెంట్ డేట్ అయిపోవడంతో ఆందోళనకు గురైంది చందన. చేసేదేమి లేక ప్రియుడు ఇంటి ముందే చందన నిరసన దీక్షకు దిగింది. స్థానికంగా ఉన్న ఒక మహిళ అడ్వకేట్, మహిళా సంఘాల నేతలు ఆమెకు సపోర్ట్ గా దీక్ష చేపట్టారు.. ఎంగేజ్మెంట్ ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని ఈశ్వర్ బెంగళూరు నుంచి ఆదోని కి తీసుకొచ్చి మోసం చేశారని చందన వాపోయింది.

చందనకు న్యాయం జరగాలని.. మరొకరికి ఇలాంటి కష్టం రాకుండా ఉండాలంటే ఈశ్వర్ కి ఆయన కుటుంబ సభ్యులకు తగిన శాస్తి జరగాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఇంతకు బాధితురాలికి న్యాయం జరుగుతుందా లేదా..? ఈశ్వర్ ఆయన కుటుంబీకులు స్పందన ఎలా ఉండనుంది.. అనేది తేలియాలంటే వేచిచూడాల్సిందే..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..