Snake Romance: పాములు నిజంగా ప్రేమించుకుంటాయా.. డిస్ట్రబ్ చేస్తే పగ పడతాయా? ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకోసం..
ప్రకాశం జిల్లా రాచర్ల మండలం బీసీ కాలనీ సమీపంలో రెండు పాములు పెనవేసుకొని సయ్యాటలాడాయి. బీసీ కాలనీ సమీపంలో రెండు పాములు పెనవేసుకొని, పరిసరాలను మరిచి సయ్యాటలాడుతుండగా స్థానికులు తమ ఫోన్లలో వీడియో రికార్డ్ చేశారు. అయితే, తమ చుట్టూ జనాలు గుమిగూడినా ఆ పాములు ఏమాత్రం పట్టించుకోలేదు సరికదా..
-
పాములు నిజంగా ప్రేమించుకుంటాయా..
-
తరచూ కనిపించే పాముల సయ్యాట వాటి సంబోగక్రియల్లోని భాగమేనా..
-
ఆడపాములు మగపాములను డామినేట్ చేస్తాయా..
-
పాముల్లో కూడా స్వయంవరాలు ఉంటాయా..
-
వాటిని డిస్ట్రబ్ చేస్తే పగ పడతాయా?
ప్రకాశం జిల్లా రాచర్ల మండలం బీసీ కాలనీ సమీపంలో రెండు పాములు పెనవేసుకొని సయ్యాటలాడాయి. బీసీ కాలనీ సమీపంలో రెండు పాములు పెనవేసుకొని, పరిసరాలను మరిచి సయ్యాటలాడుతుండగా స్థానికులు తమ ఫోన్లలో వీడియో రికార్డ్ చేశారు. అయితే, తమ చుట్టూ జనాలు గుమిగూడినా ఆ పాములు ఏమాత్రం పట్టించుకోలేదు సరికదా.. తమ సయ్యాటను యధావిధిగా కొనసాగించాయి. అవి అలసిపోయిన తరువాత.. చెరోదారిన వెళ్లిపోయాయి. అయితే పాములు సయ్యాటలాడుకుంటున్న సమయంలో కొంతమంది యువకులు వాటిని కొట్టి చంపేందుకు ప్రయత్నించడంతో అక్కడే ఉన్న పెద్దలు వారిని వారించారు. పాములు సంభోగం చేసుకుంటున్న సమయంలో వాటిని కొట్టినా, ఇబ్బంది కలిగించినా పగపడతాయని హెచ్చరించారు. అంతర్లీనంగా భారతీయ సమాజంలో పశువులు, పక్షులు, పాములు సంభోగం చేసుకుంటున్న సమయంలో వాటికి అంతరాయం కలిగించకూడదన్న భావన కారణంగానే పెద్దలు ఇలా చెబుతారన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే పాములు పగపట్టడం, వాటికి కూడా ప్రేమ, కోపం, జ్ఙాపకశక్తి ఉంటాయని భావించడం ప్రజల భ్రమే అంటున్నారు పరిశోధకులు. వీటి ప్రేమ విషయం పక్కన పెడితే పగ, గుర్తుపెట్టుకుని మరీ వెంటాడతాయన్న వాదనలో వాస్తవం లేదని ఇటీవల పరిశోధనల్లో తేలింది.
పాముల ప్రేమకు అడ్డువస్తే పగపడతాయా..?
జీవుల మనుగడకి సంభోయప్రక్రియ కీలకం. సృష్టిని కొనసాగించడం అనేది అది ఏజాతి అయినా కలయికపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే దాన్ని ఒక సృష్టికార్యంగా భావిస్తూనే భారతదేశం లాంటి ప్రాంతాల్లో ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. మనిషిని మినహాయిస్తే మిగిలిన పశు, పక్ష్యాదుల్లో కూడా ప్రేమలు, విరహాలు, అలకలు ఉంటాయన్నది ఏనాటి నుంచో వినిపిస్తున్నమాటే. మరీ ముఖ్యంగా పాములు పగపడతాయని ఎంతగా ప్రచారం ఉందో, వాటిల్లో ప్రేమ కూడా అంతేవిధంగా ఉంటుందని భారతీయులు నమ్ముతారు. ఈ నమ్మకాల ఆధారంగానే పాములపై సినిమాలు కూడా నిర్మించారు. ప్రేమించుకుంటున్న పాముల్ని అంటే సంభోగక్రియల్లో ఉన్న పాముల్ని డిస్టర్బ్ చేస్తే అవి పగబడతాయన్న ఇతివృత్తంతో ఇటు తెలుగు, అటు హిందీలోనూ పలు చిత్రాలను నిర్మించారు. అవి విజయవంతంగా ప్రదర్శించబడటం వేరే విషయం.
జూలై 16న వరల్డ్ స్నేక్స్ డే…
శృంగారం పట్ల మనోభావాలు, ప్రతిచర్యలు ప్రతి జీవికీ వేరు వేరుగా ఉంటాయట. అది మనుషులకైనా ఇతర పశుపక్ష్యాదులైనా, సరీసృపాల్లోని పాముల జాతికైనా ఒకటే అని నమ్ముతారు. భూమి ఆవిర్భావం నుంచి ఇక్కడ నివసిస్తున్న వాటిలో సరీసృపాల్లో ఒకటైన పాములు కూడా ఉన్నాయి. భూమిపై జీవం మనుగడకి పాముల మనగడ ఎంతో ముఖ్యమైందిగా భావిస్తారు. వీటి మనుగడ ప్రమాదంలో పడితే పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుందని పరిశోధకులు చెబుతారు. అందుకే అవి విషపూరితమైనా వాటిని చంపకుండా పట్టుకుని అడవిలో వదిలేయాలని అవగాహాన కల్పిస్తున్నారు. అందులో భాగంగానే ప్రతి ఏటా జూలై 16వ తేదీని వరల్డ్ స్నేక్స్ డేగా నిర్వహిస్తారు.
ఆడపాములు మగపాములను ఆకర్షిస్తాయా…
పాముల్లో స్వయంవరాలు ఉంటాయట. ఆడపాములు మగపాములను ఎన్నుకుని సయ్యాటలాడతాయట. ఈ పాముల స్వయంవరంలో మనుషుల్లోలాగే ఆడపాము మగపామును ఎన్నుకుంటుందని గుర్తించారు. ఆడపాము, మగపామును ఎన్నుకున్న తరువాత సంభోగం సాగిస్తాయి. ఈ ప్రక్రియలో ఆడపాము డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. ఆడపామే ఎప్పుడూ ఆధిపత్యం ప్రదర్శిస్తుంది. తన జతగాడి ఎంపిక నుంచి సంభోగం వరకు నిర్ణయాధికారం ఆడపాముదే. మరి ఆదివారం నాడు వరల్డ్ స్నేక్స్ డే సందర్బంగా పాములకు శుభాకాంక్షలు చెబుదామా.
మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..