Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఇవేం మాట్లాడుకుంటున్నాయో మీరేమైనా చెప్పగలరా? భలే ఇంట్రస్టింగ్‌గా ఉందండోయ్..

ఇద్దరు వ్యక్తులు కమ్యునికేట్ చేసుకోవడానికి వాడే సాధనం భాష. ఆ భాష అనేక రకాలుగా ఉంటుంది. సంజ్ఞల ద్వారా గానీ, మాట్లాడటం ద్వారా గానీ, మరే ఇతర మార్గాల ద్వారా గానీ కమ్యూనికేట్ చేసే వీలుంటుంది. మనుషులైతే మాట్లాడటమో, సైగలు చేయడమో చేస్తారు. మరి, జంతువులు ఏం చేస్తాయి? ఒకే జాతికి చెందిన జంతువులే మాట్లాడుకుంటాయా?

Watch Video: ఇవేం మాట్లాడుకుంటున్నాయో మీరేమైనా చెప్పగలరా? భలే ఇంట్రస్టింగ్‌గా ఉందండోయ్..
Crow And Cat
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 14, 2023 | 6:35 PM

ఇద్దరు వ్యక్తులు కమ్యునికేట్ చేసుకోవడానికి వాడే సాధనం భాష. ఆ భాష అనేక రకాలుగా ఉంటుంది. సంజ్ఞల ద్వారా గానీ, మాట్లాడటం ద్వారా గానీ, మరే ఇతర మార్గాల ద్వారా గానీ కమ్యూనికేట్ చేసే వీలుంటుంది. మనుషులైతే మాట్లాడటమో, సైగలు చేయడమో చేస్తారు. మరి, జంతువులు ఏం చేస్తాయి? ఒకే జాతికి చెందిన జంతువులే మాట్లాడుకుంటాయా? వేరు వేరు జంతువులు, పక్షులు కమ్యూనికేట్ చేసుకోవా? ఒకవేళ అవి శబ్ధాలు చేసినా.. వాటికి అర్థమవుతుందా? తాజాగా ఇందుకు సంబంధించిన ఇంట్రస్టింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యింది. నెటిజన్ల హృదయాన్ని కాజేసింది.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ పిల్లి గోడపై కూర్చోగా.. దాని వెనకాలే ఓ కాకి వచ్చి నిలబడింది. కాకి కావ్.. కావ్.. అంటూ తన భాషలో అరవగా.. పిల్లి దానికి బదులిచ్చినట్లు మియావ్ అంటూ శబ్ధం చేసింది. అంటే కాకి, పిల్లి మధ్య ఏదో విషయమై సంభాషణ జరిగినట్లు స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మరి ఆ పిల్లి, కాకి ఏం మాట్లాడుకున్నాయనేది గుర్తించడమే ఇప్పుడు నెటిజన్ల టాస్క్‌గా మారింది. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఓ ట్విట్టర్ యూజర్.. వీడియోను ట్వీట్ చేశారు. ఆ పిల్లి, కాకి ఏం మాట్లాడుకున్నాయో ఎవరైనా చెప్పగలరా? అంటూ యూజర్ క్యాప్షన్ పెట్టాడు. ఈ వీడియో ఇప్పుడు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. మరెందుకు ఆలస్యం.. ఈ క్యూట్ వీడియోపై మీరూ ఓ లుక్కేసుకోండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..