Viral Video: దూసుకొచ్చిన మృత్యువు.. జెడ్‌ప్లస్ సెక్యూరిటీగా మారిన ఏనుగుల మందం.. వీడియో చూస్తే షాకే..
అడవికి రాజు సింహం అనే విషయం తెలిసిందే. మగ సింహం రాజు అయినప్పటికీ.. ఎక్కువగా వేట సాగించేది మాత్రం ఆడ సింహాలే. ఆకలేసిన సమయంలో వాటి కంటే ఏ జంతువైనా పడిందో.. ఇక అంతే సంగతి. ఆ జీవికి భూమిపై కాలం చెల్లడం, సింహానికి ఆకలి తీరడం ఖాయం. అయితే, అన్ని సందర్భాలూ ఒకేలా ఉండవు.

అడవికి రాజు సింహం అనే విషయం తెలిసిందే. మగ సింహం రాజు అయినప్పటికీ.. ఎక్కువగా వేట సాగించేది మాత్రం ఆడ సింహాలే. ఆకలేసిన సమయంలో వాటి కంటే ఏ జంతువైనా పడిందో.. ఇక అంతే సంగతి. ఆ జీవికి భూమిపై కాలం చెల్లడం, సింహానికి ఆకలి తీరడం ఖాయం. అయితే, అన్ని సందర్భాలూ ఒకేలా ఉండవు. జంతువుల్లోనూ కాస్త తెలివితేటలు పెరుగుతున్నాయి. తమ జాతి జంతువులను ఎలా కాపాడుకోవాలో వాటికి ఒక అవగాహనకు వస్తున్నాయి. ముఖ్యంగా తమ పిల్లలను రక్షించుకోవడం కోసం సింహాలతోనూ తెగించి పోరాడుతున్నాయి. తాజాగా ఇందుకు నిదర్శనమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద ఓ ఏనుగుల మందకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో కొన్ని పెద్ద ఏనుగులు, తమ పిల్ల ఏనుగులతో కలిసి ఆహారం తింటున్నాయి. ఇంతలో రెండు సింహాలు దూసుకొచ్చాయి. ఏనుగు పిల్లలను తినేందుకు ప్రయత్నించాయి. అది గమనించిన పెద్ద ఏనుగులు.. వెంటనే అలర్ట్ అయ్యాయి. గున్న ఏనుగులను చుట్టుముట్టాయి. జడప్లస్ సెక్యూరిటీ మాదిరిగా ఆ పిల్ల ఏనుగులను రౌండప్ చేసి, సింహాలు వాటి దరిచేరకుండా ప్రొటెక్ట్ చేశాయి. అవి పెద్దగా ఝీంకరించగా హడలిపోయిన సింహాలు అక్కడి నుంచి పారిపోయాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. నెటిజన్లు వీడియోను చూసి ఫిదా అయిపోతున్నారు. ఐకమత్యమే బలం అని ఈ వీడియో నిరూపిస్తుందని, ఏనుగుల మంద సింహాలను ఎదుర్కొన్న విధానానికి సలాం చెబుతున్నారు. మరెందుకు ఆలస్యం.. ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేసుకోండి.




On seeing the lion, elephants form a circle around the young calves for protecting the young baby. In wild,no animal does it better than elephant herd. pic.twitter.com/husiclWSQx
— Susanta Nanda (@susantananda3) July 12, 2023
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
