AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: నువు గ్రేట్ భయ్యా.. తన ప్రాణాలను పణంగా పెట్టి మరో వ్యక్తిని కాపాడిన రియల్ హీరో..

ఈ దునియాలో చాలా కొద్దిమంది మాత్రమే నిస్వార్థపరులు ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆపదలో ఉన్నవారిని తమ ప్రాణాలను పణంగా పెట్టి కాపాడాలంటే జంకుతారు. కానీ, కొందరు మాత్రం అవేమీ ఆలోచించకుండా ముందుకు దూకుతారు. తాజాగా ఇందుకు నిదర్శనమైన మీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Watch Video: నువు గ్రేట్ భయ్యా.. తన ప్రాణాలను పణంగా పెట్టి మరో వ్యక్తిని కాపాడిన రియల్ హీరో..
Man Saves Life
Shiva Prajapati
|

Updated on: Jul 14, 2023 | 6:59 PM

Share

ఈ దునియాలో చాలా కొద్దిమంది మాత్రమే నిస్వార్థపరులు ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆపదలో ఉన్నవారిని తమ ప్రాణాలను పణంగా పెట్టి కాపాడాలంటే జంకుతారు. కానీ, కొందరు మాత్రం అవేమీ ఆలోచించకుండా ముందుకు దూకుతారు. తాజాగా ఇందుకు నిదర్శనమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సముద్రంలో కొట్టుకుపోతున్న వ్యక్తిని గమనించి, ఏమాత్రం ఆలోచించకుండా దూసుకొస్తున్న అలలకు ఎదురొడ్డి మరీ బాధితుడి ప్రాణాలు కాపాడాడు. ఈ వీడియో చూసి నెటిజన్లు సలామ్ కొడుతున్నారు.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో బీచ్ పరిసరాల్లో సరదాగా గడుపుతున్న ఓ వ్యక్తి అలల ధాటికి ఒక్కసారిగా గల్లంతయ్యాడు. సముద్రంలోకి పూర్తిగా వెళ్లిపోయాడు. ఈత రాకపోవడంతో కాపాడాలంటూ ఆర్తనాదాలు చేశాడు. ఇది గమనించిన ఓ వ్యక్తి ఏమాత్రం ఆలస్యం చేయలేదు. ఓవైపు అలలు పోటెత్తుతుండగా.. అలలను మించి దూకుతూ ముందుకు సాగాడు. నీటిలో మునిగిపోతున్న వ్యక్తిని చేరి.. అతన్ని ప్రాణాలతో బయటకు తీసుకువచ్చాడు. ఈ ఘటనను అంతా బీచ్‌లో ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో వీడియో కాస్తా వైరల్ అయ్యింది. అతని ధైర్య సాహసాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. భయానక పరిస్థితులకు ఎదురొద్ది, తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మరొక వ్యక్తి ప్రాణాలు కాపాడటం నిజంగా అద్భుతం అని కొనియాడుతున్నారు. ఈ సాహసి వీడియోను మీరూ చూసేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..