AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ఉదయం వేళ శరీరంలో కనిపించే ఈ లక్షణాలు పెను ప్రమాదానికి సంకేతం.. అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు..

డయాబెటిస్ సైలెంట్ కిల్లర్, ఇది క్రమంగా శరీరాన్ని నాశనం చేస్తుంది. ఈ డయాబెటిస్ నుంచి ప్రాణాలను కాపాడుకోవాలంటే.. ముందుగా గుర్తించాలి. వెంటనే చికిత్స తీసుకోవాలి. మరి దీన్ని గుర్తించడం ఎలా? ఈ వ్యాధి మొదటి సంకేతాలు ఎలా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినట్లు ఎలా తెలుస్తుంది?

Health Tips: ఉదయం వేళ శరీరంలో కనిపించే ఈ లక్షణాలు పెను ప్రమాదానికి సంకేతం.. అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు..
Human Body
Shiva Prajapati
|

Updated on: Jul 14, 2023 | 7:40 PM

Share

డయాబెటిస్ సైలెంట్ కిల్లర్, ఇది క్రమంగా శరీరాన్ని నాశనం చేస్తుంది. ఈ డయాబెటిస్ నుంచి ప్రాణాలను కాపాడుకోవాలంటే.. ముందుగా గుర్తించాలి. వెంటనే చికిత్స తీసుకోవాలి. మరి దీన్ని గుర్తించడం ఎలా? ఈ వ్యాధి మొదటి సంకేతాలు ఎలా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినట్లు ఎలా తెలుస్తుంది? అంటే చాలా లక్షణాలు కనిపిస్తాయిన చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఉదయాన్నే శరీరంలో కనిపించే లక్షణాలు డయాబెటిస్‌కు సంకేతాలుగా పేర్కొంటున్నారు. ఆ లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దని వైద్యులు చెబుతున్నారు. మరి ఆ లక్షణాలు ఏంటో ఇవాళ మనం తెలుసుకుందాం..

భారతదేశంలో గత కొన్నేళ్లుగా మధుమేహ బాధితుల సంఖ్యంగా భారీగా పెరుగుతోంది. మధుమేహం అనేది జీవక్రియకు సంబంధించిన రుగ్మత. మధుమేహం బాధితుల శరీరంలో తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి అవదు. తత్ఫలితంగా శరీరంలోని అవయవాల పనితీరు తగ్గుతుంది. క్రమంగా రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. ఇది మూత్రపిండాలు, చర్మం, గుండె, కళ్లు, మొత్తం శరీరాన్ని నిర్వీర్యం చేస్తుంది.

మధుమేహం ఏ వయస్సులోనైనా వచ్చే అవకాశం ఉంది. అయితే, ప్రస్తుత కాలంలో పిల్లలు, కౌమారదశలో ఉన్నవారు, యువకులు టైప్ 1 మధుమేహం బారిన పడుతున్నారు. టైప్ 2 మధుమేహం 40 ఏళ్ల తరువాత వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మధుమేహం మూత్రపిండాలు, గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.

ఇవి కూడా చదవండి

వాస్తవానికి ప్రతి ఒక్కరిలో షుగర్ లెవల్స్ ఒక్కోసారి పెరగడం, తగ్గడం జరుగుతుంది. అయితే, శరీరంలో ఉత్పత్తి అయ్యే ఇన్సులిన్.. ఆ చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. శరీరం ఉత్సాహంగా ఉండేందుకు మన కాలేయం రక్తంలో చక్కెరలను విడుదల చేస్తుంది. ఇన్సులిన్ ఉత్పత్తి సరిగా లేకపోతే.. రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అది క్రమంగా ప్రాణాంతకంగా మారుతుంది.

ఉదయం శరీరంలో కనిపించే మధుమేహ లక్షణాలు..

మధుమేహం బాధితుల్లో ఉదయం వేళ రక్తంలో చక్కెర స్థాయిలు భారీగా పెరుగుతాయి. గొంతు, నోరు పొడిబారినట్లుగా ఉంటుంది. ఇక రాత్రంతా తరచుగా మూత్రవిసర్జన చేస్తారు. మూత్రాశయం నిండటం, దృష్టి సరిగా లేకపోవడం, తరచుగా ఆకలి వేయడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మధుమేహం లక్షణాల్లో తొలుత తీవ్ర అలసట, నిద్రలేమి, కళ్లలో బలహీనత, షంగల్ ఇన్‌ఫెక్షన్లు, కురుపులు, అధిక దాహం, బరువు తగ్గడం, నయం కాని గాయాలు, ప్రైవేట్ పార్ట్‌లో దురద వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి మార్పులను గుర్తించినట్లయితే.. వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించాలి. లేదంటే పరిస్థితి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది.

మధుమేహం ఇతర లక్షణాలు..

చేతులు, కాళ్లలో వణుకు, అకస్మాత్తుగా బరువు తగ్గడం, అలసట, బలహీనత, చర్మం పొడిబారడం, ఇన్ఫెక్షన్లు, జుట్టు రాలడం, శరీరంలో రక్తం తగ్గడం, వికారం, కడుపులో నొప్పి, వాంతులు వంటి లక్షణాలు కూడా కనిపిస్తా.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..