AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fatty Liver: కొవ్వు పెరగడం వల్ల కాలేయంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది..? నిపుణుల కీలక సూచనలు

మీ శరీరంలో ఊబకాయం పెరుగుతుంటే లివర్ టెస్ట్ చేయించుకోవడం మంచిది. శరీరంలో కొవ్వు పెరగడం అనేది మీ కాలేయం కూడా కొవ్వుగా మారుతుందనడానికి సంకేతం. భవిష్యత్తులో ఇది పెద్ద ముప్పుగా మారవచ్చు. అధిక BMI (బాడీ మాస్ ఇండెక్స్) ఉన్న..

Fatty Liver: కొవ్వు పెరగడం వల్ల కాలేయంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది..? నిపుణుల కీలక సూచనలు
Fatty Liver
Subhash Goud
|

Updated on: Jul 14, 2023 | 5:45 PM

Share

మీ శరీరంలో ఊబకాయం పెరుగుతుంటే లివర్ టెస్ట్ చేయించుకోవడం మంచిది. శరీరంలో కొవ్వు పెరగడం అనేది మీ కాలేయం కూడా కొవ్వుగా మారుతుందనడానికి సంకేతం. భవిష్యత్తులో ఇది పెద్ద ముప్పుగా మారవచ్చు. అధిక BMI (బాడీ మాస్ ఇండెక్స్) ఉన్న రోగులలో 50 నుంచి 60 శాతం మంది ఫ్యాటీ లివర్ వ్యాధి బారిన పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. అటువంటి పరిస్థితిలో బరువు పెరగడాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం.

ఢిల్లీ ఎయిమ్స్‌లో ఫ్యాటీ లివర్ చికిత్స కోసం వచ్చిన రోగుల డేటాను సేకరించారు వైద్యులు. ఊబకాయం బారిన పడుతున్న వారిలో ఫ్యాటీ లివర్‌తో పాటు మధుమేహం వంటి వ్యాధులు కూడా వస్తున్నాయి. జంక్‌ ఫుడ్డు, పోషకాలు లేని ఆహారం తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ వ్యాధి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. మద్యం సేవించే వ్యక్తులలో ఈ వ్యాధి చాలా సందర్భాలలో సంభవిస్తుంది. కొవ్వు కాలేయంతో బాధపడుతున్న చాలా మంది రోగులలో ఊబకాయం కనిపిస్తుంది.

కొవ్వు కాలేయం అంటే ఏమిటి?

కాలేయంలో కొవ్వు పేరుకుపోవడాన్ని ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారని సర్ గంగారామ్ హాస్పిటల్ గ్యాస్ట్రో అండ్ లివర్ విభాగం డాక్టర్ అనిల్ అరోరా అన్నారు. చెడు ఆహారపు అలవాట్లు, నిశ్చల జీవనశైలి కారణంగా, మన శరీరం కేలరీలను కొవ్వుగా మార్చడం ప్రారంభిస్తుంది. ఇలా పెరిగిన కొవ్వు కాలేయ కణాలపై పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. దీని వల్ల కాలేయం కొవ్వుగా మారుతుంది.

ఇవి కూడా చదవండి

ఈ వ్యాధికి సకాలంలో చికిత్స అందకపోతే తీవ్రమైన కాలేయ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ఎయిమ్స్‌లోని డాక్టర్ విక్రమ్ చెప్పారు. దీని కారణంగా లివర్ సిర్రోసిస్, లివర్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందంటున్నారు వైద్యులు. ఫ్యాటీ లివర్‌తో బాధపడుతున్న వారిలో 5 శాతం మంది రోగులకు సకాలంలో చికిత్స అందక కాలేయ క్యాన్సర్‌ బారిన పడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. అనేక సందర్భాల్లో ఇది కాలేయ వైఫల్యానికి కూడా దారి తీస్తుంది. కొవ్వు కాలేయానికి స్థూలకాయం ప్రధాన కారణం.

కొవ్వు కాలేయం లక్షణాలు ఏమిటి?

  • నిరంతర కడుపు నొప్పి
  • అలసట
  • ఆహారం జీర్ణం కావడంలో ఇబ్బంది
  • బరువు తగ్గడం

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

  • ప్రతిరోజూ వ్యాయామం చేయండి
  • మద్యం సేవించవద్దు
  • ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలను చేర్చండి
  • హెపటైటిస్ A, B వ్యాక్సిన్ పొందండి
  • ధూమపానం చేయవద్దు
  • బీపీ, షుగర్ అదుపులో ఉంచుకోవాలి

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి