Andhra Pradesh: ఇప్పటిదాకా ఓ లెక్క.. ఇప్పటినుంచి మరో లెక్క.. అక్కడ వైసీపీలో కాకరేపుతున్న పందెం కోళ్లు..
Andhra Pradesh YCP Politics: ఇప్పటిదాకా ఒక లెక్క..ఇప్పటి నుంచి ఇంకో లెక్క.. తగ్గదేలే అంటూ.. ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి కాకినాడ జిల్లాలోని జగ్గంపేట పందెం కోళ్లు.. సై అంటే సై అంటూ.. ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ అగ్గి రాజేస్తున్నాయి..
Andhra Pradesh YCP Politics: ఇప్పటిదాకా ఒక లెక్క..ఇప్పటి నుంచి ఇంకో లెక్క.. తగ్గదేలే అంటూ.. ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి కాకినాడ జిల్లాలోని జగ్గంపేట పందెం కోళ్లు.. సై అంటే సై అంటూ.. ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ అగ్గి రాజేస్తున్నాయి.. దీంతో జగ్గంపేట వైసీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఎమ్మెల్యే, మాజీ మంత్రి వర్గాలు రెండుగా చీలాయి. రాబోయే ఎన్నికలకు ఎవరికి వారు అత్మీయ సమ్మేళనాలు, హాట్ హాట్ కామెంట్లతో రాజకీయం రక్తి కట్టిస్తున్నారు. అంతేకాదు వచ్చే ఎన్నికలకు ఎవరి వ్యూహాలను వాళ్లు సిద్ధం చేసుకుంటున్నారు. చంటిబాబు, తోట నరసింహం మధ్య వార్ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. తాజాగా ఆత్మయసమ్మేళం నిర్వహించిన తోట నరసింహం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవినీతీపై ప్రశ్నించే అర్హత చంటిబాబుకు లేదన్నారు. తనని అవినీతిపరుడని విమర్శిస్తే నియోజవర్గం ప్రజలే వాళ్లను చెప్పుతో కొడతారన్నారు.
అటు తోట నరసింహం కొడుకు రాంజీ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. తను ఒక్కమాట వదలాల్సి వచ్చిందన్న ఆయన.. రెండోసారి చెప్పదల్చుకోలేదన్నారు రాంజీ, మార్కెట్ కమిటీ చైర్మన్ జనపరెడ్డి బాబుకి తనదైన స్టయిల్‌లో వార్నింగ్ ఇచ్చారు. పదవులు ఉన్నాయి కదా అని ఏది పడితే అది మాట్లాడితే కుదరదన్నారు. నూటికి నూరు శాతం తోట నరసింహం గారే పోటీలో ఉంటారన్న రాంజీ… 10 ఏళ్లయిన 20 ఏళ్లయినా మీ తాట తీయడానికైనా ఆయన పోటీలో ఉంటారన్నారు.
అయితే, ఎన్నికలకు చాలా సమయం ఉండటం.. ఇప్పుడే అధికార పార్టీలో పోరు ముదురుతుండటం.. కాకినాడ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..