Pawan Kalyan: కౌలురైతుల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ ఆర్ధిక సాయం.. ఓ రైతు ఇద్దరి పిల్లల చదువు భాద్యతను తీసుకున్న జనసేనాని..
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులను పరామర్శించడమే కాకుండా.. వారి కుటుంబాలకు ఆర్ధిక సాయం అందిస్తున్నారు.
Pawan Kalyan: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతోంది. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులను పరామర్శించడమే కాకుండా.. వారి కుటుంబాలకు ఆర్ధిక సాయం అందిస్తున్నారు. బాపట్లజిల్లా యద్దనపూడి మండలంలోని యనమదల గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న కౌలురైతు పోలవరపు వెంకటేశ్వర్లు కుటుంబానికి లక్ష రూపాయల చెక్కును అందజేశారు. అంతే కాకుండా జాగర్లమూడి వారి పాలెంలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు నీలం రవి కుమార్ కుటుంబానికి లక్ష రూపాయల చెక్కు అందించారు జనసేనాని.
రవి కుమార్ బలవన్మరణానికి గల కారణాలు, ఆర్థిక పరిస్థితి గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. పార్టీ తరఫున లక్ష ఆర్థిక సాయాన్ని రవికుమార్ భార్య అశోకరాణికి అందజేశారు. ఇద్దరు బిడ్డలైన మహేశ్వరి, కార్తీక్.. చదువుల బాధ్యతను పార్టీ చూసుకుంటుందని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు.
మరిన్నిఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..