Pawan Kalyan: నాకు ఎవరితోనూ పొత్తులు లేవు.. నా పొత్తులు జనంతోనే.. పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వ తీరుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను సీబీఎన్ దత్తపుత్రుడిని కాదన్న పవన్.. సీఎం జగన్ సీబీఐ దత్తపుత్రుడు అని విమర్శించారు. తనకు ఎవరితోనూ...
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వ తీరుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను సీబీఎన్ దత్తపుత్రుడిని కాదన్న పవన్.. సీఎం జగన్ సీబీఐ దత్తపుత్రుడు అని విమర్శించారు. తనకు ఎవరితోనూ పొత్తులు లేవని, ప్రజలతోనే పొత్తులు ఉంటాయని వెల్లడించారు. ప్రకాశం జిల్లాలో జనసేన రైతు భరోసా సభలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పవన్ కళ్యాణ్ చెక్కులు పంపిణీ చేసారు. 2019 లో వైసీపీని(YCP) నమ్మిన ప్రజలు.. ప్రస్తుతం నమ్మే పరిస్థితిలో లేదని చెప్పారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయిన జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని మండిపడ్డారు. 2014 లోనే పవన్ కళ్యాణ్ వచ్చి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. వైసీపీ నాయకులు ప్రజా సమస్యలను విమర్శించారని, కౌలు రైతులకు గుర్తింపు పత్రాలు ఎవరు ఇస్తారని ప్రశ్నించారు.
నన్ను దత్తపుత్రుడు అంటే నేను ఫీల్ అవను. కానీ ముఖ్యమంత్రి జగన్ కచ్చితంగా సీబీఐ దర్యాప్తును ఎదుర్కోవాలి. నన్ను నమ్మమని నేను చెప్పట్లేదు. కానీ నేను చెప్పింది ఆలోచించండి. నేను మీతోనే ఉన్నా. నాపై నమ్మకం ఉంచండి. ఒక్కసారి జనసేన వైపు చూడాలని ప్రజలను కోరుకుంటున్నా. మీ ఆశీర్వచనాలు నాకు ఇవ్వండి. పొత్తుల కోసం మాట్లాడే సమయం కాదు. నా పొత్తులు జనంతోనే. దసరా నవరాత్రుల తరువాత రోడ్లపైకి వస్తాం. ప్రజా సమస్యలపై పోరాడతాం.
– పవన్ కళ్యాణ్, జనసేన అధినేత
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి