AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: ప్రాణభయంతో అధికార ఎమ్మెల్యేలు.. ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోణలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలి: పవన్‌ కల్యాణ్‌

రాష్ట్రంలో ప్రతీకార రాజకీయాలు పరాకాష్టకు చేరాయని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు ప్రాణ హానితో భయపడే పరిస్థితులు వచ్చాయని, ఈ ఈ విషయంలో రాష్ట్ర డీజీపీ బాధ్యత తీసుకోవాలని ఆయన సూచించారు.

Pawan Kalyan: ప్రాణభయంతో అధికార ఎమ్మెల్యేలు.. ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోణలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలి:  పవన్‌ కల్యాణ్‌
Pawan Kalyan
Basha Shek
|

Updated on: Feb 02, 2023 | 5:17 PM

Share

రాష్ట్రంలో ప్రతీకార రాజకీయాలు పరాకాష్టకు చేరాయని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు ప్రాణ హానితో భయపడే పరిస్థితులు వచ్చాయని, ఈ ఈ విషయంలో రాష్ట్ర డీజీపీ బాధ్యత తీసుకోవాలని ఆయన సూచించారు. లేకపోతే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని కేంద్ర హోమ్ శాఖకు లేఖ రాస్తానని హెచ్చరించారు. ‘మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తనకు ప్రాణహాని ఉందని ఆందోళన చెందడం చూస్తుంటే రాష్ట్రంలో ప్రతీకార రాజకీయాలు పరాకాష్టకు చేరాయనిపిస్తోంది. ప్రజా జృవితంలో సుదీర్ఘ అనుభవం, హుందా రాజకీయాలకు పేరెన్నికెగన్న ఆయన ఆందోళన చెందుతున్నారంటే మిగిలిన ప్రజాప్రతినిధుల పరిస్థితేంటి? శాసన సభ్యులే ప్రాణ హానితో భయపడే పరిస్థితులు వచ్చాయి. మేం నెల్లూరులో ఉన్నప్పటి నుంచి ఆనం కుటుంబంతో పరిచయం ఉంది. ప్రభుత్య వ్యవహార శైలి గురించి, తన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోవడంపై ఆనం రామనారాయణ రెడ్డి తన అభిప్రాయాలు వెల్లడించారు. అయితే దీనిని ప్రభుత్వ పెద్దలు నేరంగా భావిస్తున్నారు. ఆయనకు కేటాయించిన రక్షణ సిబ్బందిని సైతం తగ్గించారు. ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకొని రామనారాయణ రెడ్డి గారి ప్రాణ రక్షణ బాధ్యతను రాష్ట్ర డీజీపీ తీసుకోవాలి. డీజీపీ స్పందించకుంటే కేంద్ర హోమ్ శాఖకు లేఖ రాసి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని తెలియపరుస్తాను’

‘అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రాణభయంతో ఉన్నారు. అలాగే స్వేచ్ఛగా మాట్లాడుకొనే పరిస్థితి కూడా లేదు. సొంత ఎమ్మెల్యేలపైనే నిఘాలు, ఫోన్ సంభాషణలు దొంగ చాటుగా వినడం పాలకుల అభద్రతా భావాన్ని తెలుపుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నేరుగా సీఎం, ఆయన కార్యాలయంపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తే బాధ్యత కలిగిన డీజీపీ, హోమ్ శాఖ మంత్రి ఎందుకు మాట్లాడటం లేదు? రామనారాయణ రెడ్డి చేసిన ప్రాణ హాని ప్రకటన, కోటం శ్రీధర్ రెడ్డి చేసిన ఫోన్ ట్యాపింగ్ వ్యాఖ్యల గురించి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవ్వాలి’ అని పవన్‌ డిమాండ్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..