Perni Nani: తప్పు చేయనప్పుడు ఫోన్ ట్యాపింగ్ భయమెందుకు? కోటంరెడ్డి జగన్‌కు నమ్మక ద్రోహం చేశారు: పేర్ని నాని
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారంపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. ఎమ్మెల్యేలపై నిఘా ఉంటే ఆధారాలు చూపెట్టాలని ఆయన మీడియా సాక్షిగా కోటం రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారంపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. ఎమ్మెల్యేలపై నిఘా ఉంటే ఆధారాలు చూపెట్టాలని ఆయన మీడియా సాక్షిగా కోటం రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘కోటంరెడ్డి స్నేహితుడు రామశివారెడ్డి రికార్డింగ్ చేశారు. ఆయనే అందరికీ ఆడియో పంపారు. ఇంటెలిజెన్స్ చీఫ్ వీడియో పంపి, ఏం మెసేజ్ చేశారో కూడా చూపిస్తే బాగుండేది. ఒకసారి చెక్ చేసుకోండి అని మెసేజ్ పెట్టిన ఆయన వాట్సాప్ చాటింగ్‌ని మీడియా ముందు పెట్టొచ్చు కదా. కోటంరెడ్డిపై జగన్‌కు ప్రేమ ఉంది. కానీ ఎమ్మెల్యే ఒక చోట పనిచేస్తూ.. మరొకవైపు చూశారు. సీఎం జగన్‌కు కోటంరెడ్డి నమ్మక ద్రోహం చేశారు. చంద్రబాబుతో కోటంరెడ్డి మాట్లాడారు. గతేడాది డిసెంబర్ 25న వారిద్దరూ కలిసినట్లు, .నారాయణతో టచ్‌లో కూడా ఉండాలని చంద్రబాబు చెప్పినట్లు టీడీపీ నేతలే చెబుతున్నారు. అంతకు ముందే ఆయన లోకేష్‌తో కూడా టచ్‌లో ఉన్నారు. కానీ ఇవన్నీ తెలియక కోటంరెడ్డినే జగన్ నమ్మారు. కోటంరెడ్డి టీడీపీ నాయకుల ట్రాప్‌లో పడ్డారు. జగన్‌పై విమర్శలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం’
‘ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వర్షాకాలం, వేసవికాలం, శీతాకాలం మాదిరిగా ఇది వలసలు వెళ్లే కాలమన్నారు. ఒక పార్టీ నుండి మరో పార్టీలోకి నేతలు వలసలు వెళ్తుంటారని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన ఆలోచనలు కల్మషం లేకుండా ఉంటే ఫోన్ ట్యాపింగ్ చేస్తే నష్టం ఏముంటుంది. ఏదైనా తప్పు చేసినవారికే ఫోన్ ట్యాపింగ్ అనే భయం ఉంటుంది. అయినా మా ఎమ్మెల్యేలపై మేం ఎందుకు నిఘా పెట్టుకుంటాం’ అని దుయ్యబట్టారు పేర్ని నాని.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



