Badvel By Election: బద్వేల్‌ ఉప ఎన్నిక..గత చరిత్ర ఏం చెబుతోందంటే…

మరికొన్ని గంటల్లో బద్వేల్‌ ఉప ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. దీంతో ఓటర్లను ఆకర్షించేందుకు

Badvel By Election: బద్వేల్‌ ఉప ఎన్నిక..గత  చరిత్ర ఏం చెబుతోందంటే...
Follow us
Basha Shek

| Edited By: Anil kumar poka

Updated on: Oct 26, 2021 | 3:21 PM

మరికొన్ని గంటల్లో బద్వేల్‌ ఉప ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. దీంతో ఓటర్లను ఆకర్షించేందుకు అధికార వైసీపీతో పాటు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. అభ్యర్థులు తమ పార్టీల అగ్రనేతలను రంగంలోకి దింపి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికలో వైసీపీ గెలిపించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు లేఖలు రాశారు. ఇక బీజేపీ కూడా అగ్రనేతలను రంగంలోకి దించి ప్రచారం నిర్వహిస్తోంది. కాంగ్రెస్‌ కూడా తమ బలం నిరూపించుకునే పనిలో ఉంది. ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య ఆకస్మిక మరణంతో జరుగుతున్న ఈ ఉప ఎన్నికలో అధికార పార్టీ తరఫున వెంకట సుబ్బయ్య సతీమణి సుధ బరిలో నిలిచారు. ఇక బీజేపీ నుంచి పనతల సురేశ్‌, కాంగ్రెస్‌ తరఫున మాజీ ఎమ్మెల్యే కుతూహలమ్మ పోటీ చేయనున్నారు. టీడీపీ, జనసేన పార్టీలు ఈ ఎన్నికకు దూరంగా ఉంటున్నాయి. ఈనెల 30న ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో బద్వేల్‌ నియోజకవర్గం, గతంలో జరిగిన ఎన్నికల గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం రండి.

నియోజకవర్గ విశేషాలు… ఎస్సీ రిజర్వ్‌డ్‌ 1952లో నియోజకవర్గం ఏర్పాటు మొత్తం ఓటర్లు: 2,16,139 మహిళలు: 1,07,340 పురుషులు: 1,08,799 మొత్తం మండలాలు-7 (బద్వేలు, కలసపాడు, బి.కోడూరు, ఎస్‌.ఎ. కాశినాయన, పోరుమామిళ్ల, గోపవరం, ఆల్టూరు) ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు కాంగ్రెస్‌ 6 సార్లు, టీడీపీ 4 సార్లు, వైసీపీ 2 సార్లు, ఇతరులు 3 సార్లు విజయం సాధించాయి.

2019 ఎన్నికల విశేషాలు… గత ఎన్నికల్లో తమ అభ్యర్థిగా రాజశేఖర్‌బాబుని బరిలోకి దింపింది టీడీపీ. ఇక 2014లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీ లోకి జంప్‌ అయిన జయరాములు ఎన్నికల ముందు బీజేపీలో చేరి పార్టీ టికెట్‌ దక్కించుకున్నారు. ఇక కాంగ్రెస్‌ తరఫున కుతూహలమ్మ బరిలోకి దిగారు. అయితే వీరందరిని కాదని ప్రజలు వెంకట సుబ్బయ్యకే పట్టం కట్టారు. వైసీపీ తరఫున బరిలోకి దిగిన ఆయన 44వేల మెజారిటీతో విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి రాజశేఖర్‌ రెండో స్థానంలో నిలిచారు. కాంగ్రెస్‌ అభ్యర్థి కుతుహలమ్మకు కేవలం 2, 337 ఓట్లు మాత్రమే రాగా బీజేపీ అభ్యర్థి 735 ఓట్లతో డిపాజిట్‌ కూడా దక్కించుకోలేకపోయారు.

1999 తర్వాత గెలవని టీడీపీ… 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన టి జయరాములు, టీడీపీ అభ్యర్థి విజయ జ్యోతిపై 10 వేల మెజార్టీతో విజయం సాధించారు. ఇక 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి కమలమ్మ టీడీపీ అభ్యర్థి చిన్నయ్యపై 36 వేల మెజార్టీతో విజయం సాధించారు. అంతకుముందు 2004 ఎన్నికల్లో చిన్నగోవిందరెడ్డి(కాంగ్రెస్‌), విజయమ్మ(టీడీపీ)పై దాదాపు 5వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మొత్తం మీద కాంగ్రెస్‌ 6 సార్లు, టీడీపీ 4 సార్లు, వైసీపీ 2 సార్లు, ఇతర పార్టీ అభ్యర్థులు 3 పర్యాయాలు విజయం సాధించారు.

Also Read:

ఫామ్‌హౌస్‌ చూపిస్తానంటూ తీసుకెళ్లాడు.. ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు.. పోలీసుల ఎంట్రీతో వెలుగులోకి షాకింగ్ నిజాలు.!

Bigg Boss 5 Telugu Promo: నేను బరాబర్ మాట్లాడతా.. ఏం చేసుకుంటావో చేస్కో.. లోబో పై రెచ్చిపోయిన కాజల్..

Tesla Market Cap: రికార్డు సృష్టించిన ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా.. వేగంగా వెయ్యికోట్ల డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్..