ఫామ్‌హౌస్ చూపిస్తానంటూ తీసుకెళ్లాడు.. ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు.. పోలీసుల ఎంట్రీతో వెలుగులోకి షాకింగ్ నిజాలు.!
నాగ్‌పూర్ టు రాజమండ్రి మధ్యలో హైదరాబాద్. కిడ్నాప్ కలకలం.. కథలో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. విషయం తెలిసి పోలీసులు ఫ్యూజులు..
నాగ్‌పూర్ టు రాజమండ్రి మధ్యలో హైదరాబాద్. కిడ్నాప్ కలకలం.. దాని వెనుక గుప్తనిధుల వ్యవహారం. కథలో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. విషయం తెలిసి పోలీసులు ఫ్యూజులు ఎగిరిపోయాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కిడ్నాప్ కలకలం రేపింది. నాగపూర్ నుంచి రాజమండ్రికి వచ్చిన నలుగురు వ్యక్తులు ఒక హోటల్‌లో దిగారు. అయితే ఫామ్‌హౌస్ చూపిస్తా అంటూ ఆ నలుగురుని తోటకు తీసుకెళ్లాడు హోటల్ యజమాని. ఈ క్రమంలో 5 లక్షలు రూపాయలు ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగాడట.
భయపడిపోయిన నాగపూర్ వాసులు రాజాసింగ్‌కు ఫోన్ చేయడంతో.. ఎమ్మెల్యే రాజమండ్రి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. హోటల్ యజమాని నుంచి కాపాడారు. చివరకు వారు రాజానగరం పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. తీగ లాగితే డొంక కదిలినట్లు పోలీసుల విచారణలో ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. గుప్త నిధుల కోసం సాగిన బేరసారాలు తేడా రావడంతో విభేదాలు బయటపడినట్లు తెలుస్తోంది. మొదట కిడ్నాప్ చేశారంటూ నాగ్‌పూర్‌కు చెందిన ఒక వ్యక్తి రాజసింగ్‌కు సమాచారమిచ్చాడు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రాధేయపాలెం తోటల్లో ఉండగా అదుపులోకి తీసుకున్నారు. పరిచయం ఉన్న ద్వారక తిరుమలకు చెందిన వ్యక్తితో రాజానగరం ఫామ్ హౌస్ చేరుకున్నారు నాగ్‌పూర్‌కు చెందిన వ్యక్తులు. గుప్త నిధుల విషయంలో తేడా రావడంతోనే ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. గుప్తనిధుల నేపథ్యంలో రాజానగరం పోలీస్ స్టేషన్‌లో వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. ఈ ముఠా ఎక్కడిది? అసలు నాగ్‌పూర్ నుంచి రాజమండ్రికి ఎందుకు వచ్చింది? వీరికి పరిచయం ఉన్న వ్యక్తి ఎవరు? అసలు రాధేయపాలెం తోటల్లో ఏముంది? రెండు వర్గాల మధ్య సాగిన బేరసారాల కథేంటి అన్న కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు.
Also Read:
మరో మహామ్మరి కలకలం.. ఆంత్రాక్స్ లక్షణాలతో గొర్రెల మృతి.. జనాలు హడల్..
ఈ 5 విషయాలను ఎప్పుడూ మర్చిపోవద్దు.. లేదంటే ఏ సమస్యకి పరిష్కారం దొరకదు..