AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేడు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం.. జీవితాన్ని సేవకే అంకితం చేసిన దివ్యాంగుడు గంగాధర్

దివ్యాంగుల సమస్యలపై అవగాహన పెంపొందించడానికి, వైకల్యాలున్న వ్యక్తుల గౌరవం, హక్కులు, శ్రేయస్సు కోసం మద్దతును సమీకరించడానికి డిసెంబరు 3వ తేదీన అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం నిర్వహిస్తారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక జీవితంలోని ప్రతి అంశంలో దివ్యాంగుల ఏకీకరణ మొదలుకొని వారు పొందగలిగే ప్రయోజనాలపై అవగాహన పెంచడానికి ఈ ఉత్సవం ప్రయత్నిస్తుంది. ఈ ఏడాది 2024 లో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం థీమ్ సమగ్రమైన, సుస్థిరమైన భవిష్యత్తు కోసం దివ్యాంగుల నాయకత్వాన్ని విస్తరించడం.

నేడు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం.. జీవితాన్ని సేవకే అంకితం చేసిన దివ్యాంగుడు గంగాధర్
International Day Of Persons With Disabilities
Surya Kala
|

Updated on: Dec 03, 2024 | 12:31 PM

Share

కాకినాడలోని ముతానగర్ తీరప్రాంత గ్రామానికి చెందిన 35 ఏళ్ల గంగాధర్‌ ధైర్యం, నాయకత్వం, సేవకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాడు. దృష్టి లోపం ఉన్న గంగాధర్ తన జీవితాన్ని సమాజానికి, ముఖ్యంగా సముద్రంపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకార సంఘాలకు సహాయం చేయడానికి అంకితం చేశాడు. శారీరక వైకల్యం ఉన్న నూకరత్నంను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులు ప్రభుత్వ దివ్యాంగుల పింఛను.. తమ తల్లిదండ్రుల సహాయంతో కుటుంబ ఖర్చులను వెళ్లదీస్తున్నారు.

2013నుంచి రిలయన్స్ ఫౌండేషన్‌తో లబ్ది పొందుతున్న గంగాధర్ ఈ ఫౌండేషన్ హెల్ప్‌లైన్, వాయిస్ మెసేజ్‌లను ఉపయోగించి వాతావరణ హెచ్చరికలు, అల్లకల్లోలమైన సముద్రజలాలు, చేపలు బాగా లభ్యమయ్యే ప్రాంతాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటాడు. ఈ ముఖ్యమైన సమాచారాన్ని స్థానిక మత్స్యకార సంఘాలతో పంచుకుంటాడు. తద్వారా వారు సురక్షితంగా ఉండటానికి, జీవనోపాధిని సంపాదించుకోవడానికి సహాయం చేస్తాడు. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి భారతదేశ తీరప్రాంతంలో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా సమాచార మద్దతుతో భారతదేశ తీరప్రాంతంలో ఉన్న మత్స్యకారులకు చేపలవేట మరింత సురక్షితమైందిగా, సుస్థిరమైందిగా, లాభదాయకంగా ఉండేలా చేయడానికి రిలయన్స్ ఫౌండేషన్ ప్రయత్నిస్తోంది.

గంగాధర్ మద్దతు అక్కడితో ఆగలేదు. బయోమెట్రిక్ కార్డ్‌ల పెన్షన్ దరఖాస్తులు నింపడంలో సాయం చేస్తాడు. అర్హతలు ఉన్నప్పటికీ ఆయా పథకాలు పొందలేకపోయిన వారి సమస్యలను పరిష్కరించడంలో తన వంతు సహాయం చేస్తాడు. అంతేకాదు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి, ప్రభుత్వ రాయితీల కోసం దరఖాస్తు చేసు కోవడానికి మత్స్యకార సంఘంలోని యువకులకు మార్గనిర్దేశం చేస్తాడు.

ఇవి కూడా చదవండి

అంకితభావం, కృషితో గంగాధర్ తన కమ్యూనిటీకి అనేక విధాలుగా సహాయం చేస్తున్న తీరు.. ఒక వ్యక్తి సవాళ్లను ఎలా అధిగమించగలడు.. ప్రపంచంలో ఎలాంటి మార్పు తీసుకురాగలడనే విషయంలో సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాడు. పలువురికి స్ఫూర్తినిస్తున్నాడు. గంగాధర్ కథ సంకల్పం, శక్తి దేవుడిని గుర్తు చేస్తుంది. నిజమైన “దృష్టి” హృదయం నుంచి వస్తుందని రుజువు చేస్తున్నాడు.. చూపును మించిన దృష్టితో పదువురికి తన వంతు సాయం అందిస్తున్నాడు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..