- Telugu News Photo Gallery Travel India: Best Five Places to Visit in Kerala Travel Tourism, know the details
Kerala in Winter: చలికాలంలో కేరళలోని ఈ ప్రదేశాలు సందర్శించండి.. జీవితంలో మధురజ్ఞాపకాలు మీ సొంతం..
దక్షిణ భారత దేశంలో అందమైన ప్రదేశం కేరళ పచ్చటి ప్రాంతాలతో ఇంద్రియాలకు విందు. మనోహరమైన పట్టణాలు, శోభాయమానమైన దేవాలయాలు, అందమైన బీచ్‌లు, మెలికలు తిరిగే నదులు పర్యటనను గుర్తుండిపోయేలా చేస్తుంది. ఈ ఐదు ప్రదేశాలను సందర్శించడం ప్రకృతి ప్రేమికులకు గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. ఈ రాష్ట్రానికి వెళ్ళాలని యాత్రను ప్లాన్ చేస్తుంటే.. ఈ ప్రదేశాలను తప్పక అన్వేషించండి.
Updated on: Dec 03, 2024 | 11:36 AM

దక్షిణ భారత దేశంలో పర్యటనకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం కేరళ. అక్కడ ఉన్న పచ్చని వాతావరణాన్ని ప్రజలు చాలా ఇష్టపడతారు. నిత్యం పర్యాటకులతో రద్దీ ఉంటుంది. అంతేకాదు కేరళను సందర్శించడానికి దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తారు. ఇక్కడ వాతావరణం సెప్టెంబర్ నుంచి మార్చి మధ్య చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. దీని కారణంగా భారీ సంఖ్యలో పర్యాటకులు ఇక్కడకు వస్తారు. మీరు కూడా కేరళ వెళ్లాలనుకుంటున్నట్లయితే ఖచ్చితంగా సందర్శించాల్సిన ప్రదేశాల లిస్ట్‌లో కొన్ని ప్రదేశాల పేర్లను చేర్చుకోండి. కేరళలోని ఈ ప్రదేశాలను అన్వేషించడం థ్రిల్లింగ్, చిరస్మరణీయ అనుభవం.

కేరళలో చూడాల్సిన అందమైన ప్రదేశాలు ఉన్నాయి. కనుక శీతాకాలంలో ట్రిప్‌కి వెళ్లిన తర్వాత ఎక్కడికి వెళ్లాలి, ఎక్కడికి వెళ్లకూడదు అనే కన్ఫ్యూజన్ రాకుండా ఉండేందుకు మీ పర్యటన లిస్ట్‌లో 5 స్థలాలను చేర్చుకోండి. ఈ ప్రదేశాలను చూసిన మనసు ఆనందంతో పురివిప్పుతుంది. ఇది భూతల స్వర్గం వంటి ప్రదేశం గురించి తెలుసుకుందాం.

అల్లెప్పి: కేరళకు వెళితే అలెప్పీని తప్పకుండా సందర్శించండి. ఇక్కడ వెంబనాడ్ సరస్సు దృశ్యం మంత్రముగ్ధులను చేస్తుంది. ఈ సరస్సులో బోటింగ్‌ని కూడా ఆస్వాదించవచ్చు. కుటుంబం, స్నేహితులతో అందమైన, చిరస్మరణీయమైన యాత్రను ఆనందించవచ్చు. అలెప్పీలో హౌస్‌బోట్ అనుభవం కూడా అద్భుతంగా ఉంటుంది.

కుమరకోమ్: అలెప్పి దగ్గర్లోని కుమరకోమ్ వెళ్ళడం ఓ మంచి అనుభూతిని ఇస్తుంది. ప్రకృతితో పాటు జంతు ప్రేమికులైతే ఇక్కడికి రావడం చాలా ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది. కుమరకోమ్‌లోని బర్డ్ సెంచరీ అబ్జర్వేటరీ టవర్‌ని సందర్శించవచ్చు. ఇక్కడ అనేక అందమైన పక్షి జాతులను చూసిన తర్వాత హృదయం సంతోషిస్తుంది. అంతేకాదు కుమరకోమ్ బీచ్ ప్రజలలో అత్యంత ప్రసిద్ధ ట్రిప్ డెస్టినేషన్ ప్రాంతం. ఇక్కడ ప్రకృతి దృశ్యాలను ఆస్వాదిస్తూ రెస్టారెంట్‌లో ఆహారాన్ని ఆస్వాదించవచ్చు. నీటి క్రీడలను కూడా ఆస్వాదించవచ్చు.

మున్నార్: ఎగిరే మేఘాలను దగ్గరగా చూడాలనుకుంటే మున్నార్‌ని సందర్శించండి. పర్వతాల ఎత్తు నుంచి విశాలమైన పచ్చదనాన్ని చూడటం ఒక విభిన్నమైన అనుభూతిని కలిగిస్తుంది. కేరళలోని హిల్ స్టేషన్ మున్నార్ పర్యాటకుల టాప్ లిస్ట్‌లో చేర్చబడింది. భారీ తేయాకు తోటలు, పచ్చని దారులు, ట్రెక్కింగ్, మౌంటెన్ బైకింగ్ మొదలైన అంశాలు మిమ్మల్ని థ్రిల్‌తో నింపుతాయి.

కోవలం బీచ్: కేరళ పర్యటనకు వెళ్లాలనుకుంటే తిరువనంతపురం నగరంలో ఉన్న కోవలం బీచ్‌ను తప్పకుండా సందర్శించండి. ఈ బీచ్ లోని దృశ్యం అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ బీచ్ రెండు భాగాలుగా విభజించబడింది. వాటిలో ఒకటి లైట్ హౌస్ బీచ్.. మరొకటి ఈవ్స్ బీచ్ అని పిలుస్తారు. ఇక్కడ తీరం ఒడ్డుకు సమీపంలోని రెస్టారెంట్లలో రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించవచ్చు. పారాసైలింగ్, జెట్ స్కీయింగ్, సర్ఫింగ్ వంటి కార్యకలాపాలు లైట్‌హౌస్ బీచ్‌లో చేయవచ్చు. ఇక్కడికి వెళ్లడం ద్వారా ఎనర్జిటిక్‌గా, పూర్తి తాజాదనాన్ని అనుభవిస్తారు.

కేరళలోని తేక్కడి: కేరళ ట్రిప్ బకెట్ జాబితాలో తేక్కడిని చేర్చుకోండి. ఈ ప్రదేశం కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఉంది. ఈ ప్రదేశం ఉత్తేజకరమైన కార్యకలాపాలు చేసే వారికి, ప్రకృతి ప్రేమికులకు చాలా బాగుంటుంది. తేక్కడి హిల్ స్టేషన్‌లో పెరియార్ వన్యప్రాణుల అభయారణ్యం, మంగళ దేవి ఆలయం, కుమిలి, తేక్కడి సరస్సు, మురక్కడి (మసాలా తోటలు, కాఫీ తోటలకు ప్రసిద్ధి) వంటి ప్రదేశాలను సందర్శించవచ్చు.




