Mythology: మైథాలజీకి ఆడియన్స్‎లో క్రేజ్.. అన్నీ ఇండస్ట్రీల్లోనూ ఇదే ట్రెండ్..

సిల్వర్‌స్క్రీన్‌ మీద సోషల్‌ డ్రామాలే కాదు, మైథలాజికల్‌ కంటెంట్‌కి కూడా రోజురోజుకీ డిమాండ్‌ పెరుగుతోంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఆసక్తిగా చూడాలనుకుంటున్నారు ఈ కంటెంట్‌ని. అందుకే అన్నీ ఇండస్ట్రీల్లోనూ పౌరాణికాలకు డిమాండ్‌ పెరుగుతోంది.

Prudvi Battula

|

Updated on: Dec 03, 2024 | 9:45 AM

ఆలస్యమైందా ఆచార్య పుత్రా అంటూ కల్కిలో ప్రభాస్‌ కర్ణుడి గెటప్‌లో కనిపించినప్పుడు, అర్జునుడిగా విజయ్‌ దేవరకొండ అప్పియరెన్స్ ఇచ్చినప్పుడు ఆడియన్స్ అరుపులు, కేకలతో హోరెత్తిపోయాయి థియేటర్లు.

1 / 5
దీన్నిబట్టి పౌరాణికాలు, భక్తి చిత్రాలకు ఇప్పుడు ఎంత క్రేజ్‌ ఉందో స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి జంటగా ఆల్రెడీ నార్త్‎లో రామాయణం తెరకెక్కుతోంది. మన దగ్గర కన్నప్ప సెట్స్ మీదుంది.

2 / 5
హనుమాన్‌ కాన్సెప్ట్ తో ప్యాన్‌ ఇండియా ప్రేక్షకులను మెప్పించారు ప్రశాంత్‌ వర్మ. ఈ ఏడాది సంక్రాంతికి చిన్న మూవీగా విడుదలైంది హనుమాన్‌. అయితే మైథలాజికల్‌ టచ్‌తో సాగే సబ్జెక్ట్ అందరినీ ఆకట్టుకుంది. నెక్స్ట్ కూడా ఇలాంటి కాన్సెప్టుతోనే అడుగులు వేస్తున్నారు కెప్టెన్‌. జై హనుమాన్‌ అంటూ రిషబ్‌శెట్టితో సినిమా చేస్తున్నారు.

3 / 5
 అటు సూర్య కర్ణ ప్రాజెక్ట్ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. రీసెంట్‌గా ఆయన నటించిన కంగువ సినిమా జనాలను పెద్దగా మెప్పించలేదు. దాంతో కొన్నాళ్ల పాటు ప్రయోగాలకు దూరంగా ఉండదలచుకున్నారు ఈ హీరో. ఒక్కసారి ఆ మైండ్‌ సెట్‌ నుంచి బయటకు వచ్చారంటే కర్ణ సినిమా పట్టాలెక్కించాలన్నది ప్లాన్‌.

4 / 5
హోంబలే సంస్థ మహావతార్‌: నరసింహ అనే యానిమేషన్‌ ప్రాజెక్టుతో రెడీ అవుతోంది. నార్త్‎లో విక్కీ కౌశల్‌ హీరోగా పరశురాముడి కథతో మరో మహావతార్‌ మూవీ నిర్మాణంలో ఉంది. తెలుగులో జై హనుమాన్‌లో నటిస్తున్న రిషబ్‌ శెట్టి, కన్నడలో చేస్తున్న కాంతార కూడా డివైన్‌ సబ్జెక్టే.

5 / 5
Follow us