Andhra Pradesh: ఆమె సాఫ్ట్‌వేర్.. అతడు ఫుడ్ బిజినెస్.. ఇంతకీ రూమ్‌లో అసలు ఏం జరిగిందంటే..

విశాఖపట్నంలో విషాదం చోటు చేసుకుంది. అపార్ట్‌మెంట్ పై నుంచి దూకి ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. గాజువాక పోలిస్ స్టేషన్ అక్కిరెడ్డిపాలెంలో చోటుచేసుకుంది. మంగళవారం వెంకటేశ్వర కాలనీ షీలా నగర్ లో అపార్ట్‌మెంట్ పై నుంచి దూకి యువతి, యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డారు.

Andhra Pradesh: ఆమె సాఫ్ట్‌వేర్.. అతడు ఫుడ్ బిజినెస్.. ఇంతకీ రూమ్‌లో అసలు ఏం జరిగిందంటే..
Crime News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 03, 2024 | 11:43 AM

విశాఖపట్నంలో విషాదం చోటు చేసుకుంది. అపార్ట్‌మెంట్ పై నుంచి దూకి ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. గాజువాక పోలిస్ స్టేషన్ అక్కిరెడ్డిపాలెంలో చోటుచేసుకుంది. మంగళవారం వెంకటేశ్వర కాలనీ షీలా నగర్ లో అపార్ట్‌మెంట్ పై నుంచి దూకి యువతి, యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన అనంతరం స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.. వెంటనే అక్కడికి చేరుకున్న గాజువాక పోలీసులు.. వివరాలు సేకరించారు. మృతులు పిల్లి దుర్గారావు, సాయి సుష్మితాలుగా గుర్తించారు గాజువాక పోలీసులు.. యువకుడు పిల్లి దుర్గారావు రంగా కేటరింగ్ ఓనర్ కాగా.. నూకల సాయి సుస్మిత సాఫ్ట్వేర్ ఉద్యోగి అని పేర్కొన్నారు. దుర్గారావు స్థానికంగా ఫుడ్ బిజినెస్ చేస్తుండగా.. సుస్మిత హైదరాబాద్ లో పనిచేస్తోంది..

కాగా.. విశాఖ ప్రేమజంట ఆత్మహత్యలో మరో కోణం బయటపడింది. అమలాపురానికి చెందిన యువతీ, యువకులు.. కొన్నాళ్లుగా విశాఖలో సహజీవనం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే రూమ్‌లో గొడవ పడటం, ఆ తర్వాత ఇద్దరూ బిల్డింగ్ పై నుంచి దూకడం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గత కొంత కాలంలో వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని.. ఈ క్రమంలోనే.. సోమవారం ఉదయం అపార్ట్‌మెంట్‌ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఆత్మహత్యకు ముందు రూమ్‌లో గొడవ జరిగినట్లు పేర్కొంటున్నారు. రూమ్‌లో టీవీ రిమోట్, టీ కప్పులు, గాజు సామాగ్రి పగిలి ఉండటంతో.. ఇద్దరి మధ్య గొడవ జరిగి ఉండొచ్చని.. పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..