AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విజయవాడ వెళ్లే రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు.. అసలు కారణం ఇదే..

ఆంధ్రప్రదేశ్‎లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయన ప్రమాణస్వీకార మహోత్సవానికి దేశం నలుమూలల నుంచి పేరొందిన రాజకీయ నాయకులు, పలువురు సినీ ప్రముఖులు, మరికొందరు వీవీఐపీలు హాజరుకానున్నారు. ఇప్పటికే కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున విజయవాడ చేరుకున్నారు. కేసరపల్లిలో నిర్వహించే ఈ వేడుకకు ఆ ప్రాంతమంతా సర్వంగసుందరంగా ముస్తాబయింది. అయితే విజయవాడకు హైదరాబాద్ నుంచి కూడా టీడీపీ శ్రేణులు, అభిమానులు, పలువురు నాయకులు తరలివెళ్తున్నారు.

విజయవాడ వెళ్లే రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు.. అసలు కారణం ఇదే..
Vijayawada Traffic
Srikar T
| Edited By: |

Updated on: Jun 12, 2024 | 11:34 AM

Share

ఆంధ్రప్రదేశ్‎లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయన ప్రమాణస్వీకార మహోత్సవానికి దేశం నలుమూలల నుంచి పేరొందిన రాజకీయ నాయకులు, పలువురు సినీ ప్రముఖులు, మరికొందరు వీవీఐపీలు హాజరుకానున్నారు. ఇప్పటికే కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున విజయవాడ చేరుకున్నారు. కేసరపల్లిలో నిర్వహించే ఈ వేడుకకు ఆ ప్రాంతమంతా సర్వంగసుందరంగా ముస్తాబయింది. అయితే విజయవాడకు హైదరాబాద్ నుంచి కూడా టీడీపీ శ్రేణులు, అభిమానులు, పలువురు నాయకులు తరలివెళ్తున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ నేషనల్ హైవేలలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. కేసరపల్లికి తరలివచ్చే నేతలు, జనానికి ఇబ్బంది లేకుండా మొత్తం మూడు మార్గాల్లో డైవర్షన్స్‌ చేపట్టింది అధికార యంత్రాంగం. చెన్నై-విశాఖ, విశాఖ-హైదరాబాద్‌, విజయవాడ-భీమవరం రూట్స్‌లో ఐదు చోట్ల ట్రాఫిక్‌ మళ్లింపు చేపట్టారు పోలీసులు.

ఈ రూట్ల మీదగా మళ్లింపులు..

రూట్‌ నెంబర్‌ 1 విశాఖ టు చెన్నై, నేషనల్‌ హైవే-216పై విశాఖ నుంచి చెన్నై వెళ్లే వాహనాలను కత్తిపూడి నుంచి ఒంగోలు వైపు మళ్లిస్తున్నారు. ఈ మొదటి డైవర్షన్‌లో నందిగామ, వైరా, సత్తుపల్లి, జంగారెడ్డిగూడెం, దేవరపల్లి, గామన్‌ బ్రిడ్జ్‌ మీదుగా విశాఖ వైపు మళ్లిస్తారు.

రూట్‌ నెంబర్‌ 2 చెన్నై టు విశాఖ, ఈ రూట్‌లో ఒంగోలు వైపు నుంచి వచ్చే వాహనాలను రేపల్లె, మచిలీపట్నం, నరసాపురం, అమలాపురం, కాకినాడ, కత్తిపూడి మీదుగా విశాఖ వైపు మళ్లిస్తారు. అలాగే, బుడంపాడు వైపు నుంచి వచ్చే వాహనాలను తెనాలి, పులిగడ్డ, మచిలీపట్నం, నరసాపురం, కాకినాడ, కత్తిపూడి మీదుగా విశాఖ వైపు మళ్లించనున్నారు.

రూట్‌ నెంబర్‌ 3 విశాఖ టు హైదరాబాద్‌, ఈ మార్గంలో ఐదుచోట్ల మళ్లింపులు చేపట్టారు. రాజమండ్రి వైపు నుంచి వచ్చే వాహనాలను రామవరప్పాడు, మైలవరం, నూజివీడు, హనుమాన్ జంక్షన్, ఏలూరు బైపాస్ మీదుగా వాహనాలను పంపిస్తున్నారు గామన్‌ బ్రిడ్జ్‌, దేవరపల్లి, జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట, ఖమ్మం మీదుగా హైదరాబాద్‌ వైపు మళ్లిస్తున్నారు. అలాగే, భీమడోలు వైపు నుంచి వచ్చే వాహనాలను ద్వారకాతిరుమల, కామవరపుకోట, చింతలపూడి నుంచి ఖమ్మం వైపు తరలిస్తున్నారు. ఏలూరు బైపాస్‌ నుంచి వచ్చే వాహనాలను రెండు మార్గాల్లో మళ్లిస్తున్నారు. ఒకటి జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట, ఖమ్మం మీదుగా.. రెండోది చింతలపూడి, సత్తుపల్లి మీదుగా హైదరాబాద్‌ వైపు. ఇక, హనుమాన్‌ జంక్షన్‌ మీదుగా వచ్చే వాహనాలను నూజివీడు, మైలవరం, ఇబ్రహీంపట్నం, నందిగామ మీదుగా హైదరాబాద్‌ వైపు మళ్లిస్తున్నారు.

రూట్‌ నెంబర్‌ 4 హైదరాబాద్‌ టు విశాఖ, ఈ మార్గంలో కూడా నాలుగు చోట్ల మళ్లింపులు చేపట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయ్‌. వాహనదారులు ఈ డైవర్షన్స్‌ను గమనించి పోలీసులకు సహకరించాలంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..

మెస్సీ కోల్‌కతా పర్యటన.. కోర్టు మెట్లెక్కిన భారత మాజీ కెప్టెన్
మెస్సీ కోల్‌కతా పర్యటన.. కోర్టు మెట్లెక్కిన భారత మాజీ కెప్టెన్
కెప్టెన్‌తో గొడవ.. కట్ చేస్తే.. 6 బంతుల్లో ఉతికారేసిన బౌలర్..
కెప్టెన్‌తో గొడవ.. కట్ చేస్తే.. 6 బంతుల్లో ఉతికారేసిన బౌలర్..
మరో 2రోజుల్లో తెలంగాణ సెట్ 2025 పరీక్షలు.. హాల్ టికెట్ల లింక్ ఇదే
మరో 2రోజుల్లో తెలంగాణ సెట్ 2025 పరీక్షలు.. హాల్ టికెట్ల లింక్ ఇదే
ఈ సారి తేడా కొట్టిందో డీజే మోతే.. అంతటా డేగ కన్ను
ఈ సారి తేడా కొట్టిందో డీజే మోతే.. అంతటా డేగ కన్ను
ఖాళీ కడుపుతో వీటిని తిన్నారో మీ పని అయిపోయినట్లే.. ఈ సమస్యలు..
ఖాళీ కడుపుతో వీటిని తిన్నారో మీ పని అయిపోయినట్లే.. ఈ సమస్యలు..
కొత్త బీమా సవరణ బిల్లు 2025కే ఆమోదం!
కొత్త బీమా సవరణ బిల్లు 2025కే ఆమోదం!
కేకేఆర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 9.2 కోట్ల ప్లేయర్..
కేకేఆర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 9.2 కోట్ల ప్లేయర్..
నేటి నుంచే హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2025 షురూ.. టైమింగ్స్ ఇవే!
నేటి నుంచే హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2025 షురూ.. టైమింగ్స్ ఇవే!
ఆస్కార్‌కు షార్ట్‌లిస్ట్ మూవీ హోమ్‌బౌండ్ ను ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
ఆస్కార్‌కు షార్ట్‌లిస్ట్ మూవీ హోమ్‌బౌండ్ ను ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
నిధి అగర్వాల్‌తో అనుచిత ప్రవర్తన.. వారిపై పోలీస్ కేసులు నమోదు
నిధి అగర్వాల్‌తో అనుచిత ప్రవర్తన.. వారిపై పోలీస్ కేసులు నమోదు