AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీధినపడ్డ కుటుంబం.. భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య..!

స్థానికులు అపస్మారక స్థితిలో ఉన్న కిషోర్ ను గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే అతడిని పార్వతీపురం మన్యం జిల్లా ఆసుపత్రికి తరలించారు కుటుంబసభ్యులు. అయితే చికిత్స పొందుతూ కిశోర్ పరిస్థితి విషమించి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న భార్య భార్గవి తో పాటు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

వీధినపడ్డ కుటుంబం.. భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య..!
Constable Dies By Suicide
Gamidi Koteswara Rao
| Edited By: Ram Naramaneni|

Updated on: Oct 30, 2025 | 9:17 PM

Share

పార్వతీపురం జిల్లా కొమరాడ మండలంలో విషాదం చోటుచేసుకుంది. మద్యానికి బానిసైన ఓ యువకుడు భార్య మందలించిందన్న మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోటవాని వలస గ్రామానికి చెందిన కిషోర్ (30) వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే కిషోర్ గత కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. కుటుంబసభ్యులు పలుమార్లు మద్యం మానుకోవాలని హెచ్చరించినా కిషోర్ మాత్రం అలవాటును విడిచి పెట్టలేకపోయాడు.

ఇటీవల పనులు కూడా వెళ్లకుండా నిత్యం మద్యం మత్తులో కాలం వెళ్లదీస్తున్నాడు. ఈ క్రమంలోనే అప్పుల పాలయ్యాడు. మద్యం మానుకోవాలన్న అంశంపై భార్యాభర్తల మధ్య పలుసార్లు ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్య మరోసారి చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో భార్గవి తన పుట్టింటికి వెళ్లిపోయింది. భార్గవి కిషోర్ ని మందలించి అలిగి వెళ్లిపోవడంతో కిషోర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అలా గురువారం (అక్టోబర్ 30) ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన కిశోర్ విక్రాంపురం సమీపంలోని ఓ మామిడి తోటకు వెళ్లి అక్కడ గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

కొంతసేపటి తర్వాత స్థానికులు అపస్మారక స్థితిలో ఉన్న కిషోర్ ను గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే అతడిని పార్వతీపురం మన్యం జిల్లా ఆసుపత్రికి తరలించారు కుటుంబసభ్యులు. అయితే చికిత్స పొందుతూ కిశోర్ పరిస్థితి విషమించి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న భార్య భార్గవి తో పాటు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మద్యానికి బానిసై మద్యం మత్తులో కిషోర్ తీసుకొని నిర్ణయం ఆ కుటుంబాన్ని చిన్నభిన్నం చేసింది. ఈ ఘటన పై భార్య భార్గవి ఫిర్యాదు మేరకు కొమరాడ పోలీస్ స్టేషన్ ఎస్సై నీలకంఠం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గ్రామంలో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నెలకొల్పింది.

భర్త మరణంతో భార్గవి, తన పిల్లలకు ఇంటికి పెద్ద దిక్కులేని పరిస్థితి ఏర్పడింది. క్షణికావేశంలో జరిగిన ఈ ఘటన కుటుంబాన్ని తీవ్ర దుఃఖంలో ముంచింది. భర్త కోల్పోయిన భార్గవి, కొడుకును కోల్పోయిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో మద్యం వ్యసనం ఎన్నో కుటుంబాలను దుఃఖంలోకి నెడుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మద్యానికి బానిసైనా సందర్భంలో ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన డి అడిక్షన్ సెంటర్‌ను ఆశ్రయిస్తే బయటపడటానికి కొంతవరకు ప్రయోజనం ఉంటుందని అంటున్నారు పోలీసులు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..