Hindupur Election Result 2024: హిందూపురంలో బాలయ్య హాట్రిక్ విజయం.. ఎంత మెజార్టీ అంటే..
Hindupuram Assembly Election Result in telugu: హిందూపురంలో బాలయ్య మూడో సారి ముచ్చటగా గెలవనున్నారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి టి.ఎన్. దీపికపై విజయం సాధించనున్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి హిందూపురం టీడీపీకి కంచుకోటగా ఉంది. అయితే గత మూడు సార్లుగా బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధిస్తూ వచ్చారు. 2014, 2019, 2024లో హాట్రిక్ విజయాన్ని సాధించారు. 2014లో బాలకృష్ణ టీడీపీ నుంచి పోటీ చేసి 81,543 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అప్పుడు 51.12 ఓటు షేరు నమోదైంది.

హిందూపురంలో బాలయ్య మూడో సారి ముచ్చటగా గెలవనున్నారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి టి.ఎన్. దీపికపై విజయం సాధించనున్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి హిందూపురం టీడీపీకి కంచుకోటగా ఉంది. అయితే గత మూడు సార్లుగా బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధిస్తూ వచ్చారు. 2014, 2019, 2024లో హాట్రిక్ విజయాన్ని సాధించారు. 2014లో బాలకృష్ణ టీడీపీ నుంచి పోటీ చేసి 81,543 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అప్పుడు 51.12 ఓటు షేరు నమోదైంది. 2019లో 91,704 వేల ఓట్ల మెజార్టీతో గెలిచినప్పటికీ ప్రతి పక్షనేతగా కొనసాగారు. తిరిగి తాజాగా 2024లోకూడా గెలుపు దిశగా దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం 7వేలకుపైచిలుకు మెజార్టీతో గెలుపొందారు. సమీప వైసీపీ అభ్యర్థి టీఎన్ దీపిక ఓటమిపాలయ్యారు. రౌండ్లు దగ్గర పడుతుండటంతో విజయం బాలయ్యకు దాదాపు ఖాయమైనట్లుగా కనిపిస్తోంది. దీంతో ఆయన నివాసం వద్ద అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటాయి. ఆయనను చూసేందుకు వచ్చిన అభిమానులకు చేతులు ఊపుతూ అభివాదం చేశారు బాలయ్య.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
