Happy New Year 2021: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో న్యూఇయర్ వేడుకలపై పలు ఆంక్షలు.. పూర్తి వివరాలివే..
Happy New Year 2021: 'స్ట్రెయిన్' వైరస్ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలోనే న్యూఇయర్ వేడుకలపై..

Happy New Year 2021: ‘స్ట్రెయిన్’ వైరస్ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలోనే న్యూఇయర్ వేడుకలపై పలు ఆంక్షలు విధించాయి. రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించాయి. కొత్తరకం కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలందరూ ఇళ్లలోనే న్యూఇయర్ వేడుకలు జరుపుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఏపీవ్యాప్తంగా ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడలలో నూతన సంవత్సర వేడుకలపై పోలీసులు నిషేధం విధించారు. ఆయా ప్రాంతాల్లో న్యూఇయర్ వేడుకలకు ఎలాంటి అనుమతులు లేవని వెల్లడించారు. అవాంఛనీయ ఘటనలు, అల్లర్లకు తావులేకుండా ముఖ్యమైన ప్రదేశాల్లో పోలీస్ గస్తీ, బందోబస్తు ఏర్పాటు చేశారు.
వ్యాపార సంస్థలు, ఇతర షాపులకు రాత్రి 10 గంటల వరకే అనుమతి ఇవ్వగా… హోటల్స్, ఫంక్షన్ హాల్స్.. వివిధ సంస్థలలో జరిపే కార్యక్రమాలకు ఎలాంటి ప్రత్యేక అనుమతులు లేవని తేల్చి చెప్పారు. అలాగే వైన్ షాపులు రాత్రి 8 గంటల వరకే మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు. బార్ & రెస్టారెంట్లకు మాత్రం రాత్రి 11 గంటల వరకు అనుమతి ఉంటుందన్నారు. రోడ్లపై జనాలు గుమిగూడటం, పబ్లిక్ ప్రాంతాల్లో కేక్ కట్టింగ్ చేయడానికి పర్మిషన్ లేదని తేల్చి చెప్పారు.
అటు హైదరాబాద్‌లో కూడా న్యూఇయర్ వేడుకలపై పోలీసులు నిబంధనలు విధించారు. ఇవాళ రాత్రి నుంచి పలు ఫ్లై ఓవర్లను మూసి ఉంచనున్నారు. అలాగే ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లస్ రోడ్డు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బార్లు, క్లబ్బులకు అర్ధరాత్రి ఒంటి గంట వరకు అనుమతి ఉందని.. వైన్ షాపుల అర్ధరాత్రి 12 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచాలని పోలీసులు స్పష్టం చేశారు. కాగా, మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పని సీపీ సజ్జనార్ హెచ్చరించారు.
Also Read:
తెలుగు రాష్ట్రాల ప్రజలకు పండుగ శుభవార్త.. ప్రత్యేక రైళ్లు పొడిగింపు.. పూర్తి వివరాలివే..!
వైఎస్సార్ రైతు భరోసా డబ్బు జమ కాలేదా.? అయితే ఈ నెంబర్‌కు కాల్ చేయండి.!
ట్యాక్స్ పేయర్స్‌కు గుడ్ న్యూస్.. మరోసారి ఐటీ రిటర్న్స్ గడువు పొడిగింపు
ఏపీ ప్రజలకు ఆర్టీసీ ఓ గుడ్ న్యూస్.. మరో బ్యాడ్ న్యూస్.. అదేంటంటే.!
