CM Jagan Warning: ఆ మాట ఎక్కడా వినిపించొద్దు.. ఉన్నతాధికారులకు ఏపీ సీఎం జగన్ సీరియస్ వార్నింగ్..

ఏపీ సీఎం రాష్ట్ర ఉన్నతాధికారులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇళ్ళ పట్టాల పంపిణీపై కీలక ఆదేశాలు జారీ చేశారు. గురువారం సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతోను...

CM Jagan Warning: ఆ మాట ఎక్కడా వినిపించొద్దు.. ఉన్నతాధికారులకు ఏపీ సీఎం జగన్ సీరియస్ వార్నింగ్..
Follow us
Rajesh Sharma

|

Updated on: Dec 31, 2020 | 4:11 PM

AP CM Jagan warns CMO officials: ఏపీ సీఎం రాష్ట్ర ఉన్నతాధికారులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇళ్ళ పట్టాల పంపిణీపై కీలక ఆదేశాలు జారీ చేశారు. గురువారం సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతోను, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతోను కీలకాంశాలను పంచుకున్నారు. తన అభిమతాన్ని వారికి విశదపరిచారు.

‘‘ అర్హత ఉండి ఇంటిపట్టా రాలేదనే మాట ఎక్కడా వినిపించకూడదు.. ఇంటి పట్టాలు అర్హులందరికీ అందాలి.. పొరపాటున ఎక్కడైనా మిగిలిపోయి ఉంటే వారికి వెంటనే పట్టాలు ఇప్పించాలి.. అర్హులకు పథకాలను కత్తిరించే ప్రభుత్వం మనది కాదు.. మనం పేదల సంక్షేమం కోసం యజ్ఞం చేస్తున్నాం.. అర్హులకు పథకాలన్నీ అందాల్సిందే.. అదే సమయంలో అనర్హుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.. పెన్షన్, బియ్యంకార్డు, ఇంటి పట్టాకు సంబంధించి సచివాలయాల్లో పెండింగులో దరఖాస్తులు లేకుండా చూసుకోవాలి.. ’’ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేశారు.

అర్హులైన వారికి 10 రోజుల్లో బియ్యం కార్డు అందజేయాలని సీఎం ఆదేశించారు. 10 రోజుల్లో పెన్షన్, 20 రోజుల్లో ఆరోగ్యశ్రీ కార్డు, 90 రోజుల్లో ఇంటి పట్టా ఇస్తామన్న హామీ నిలబెట్టుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ఈ లక్ష్యాలను కచ్చితంగా అందుకుంటూ ముందుకు సాగాలన్నారు. ఎప్పటికప్పుడు వస్తున్న దరఖాస్తులను పరిష్కరించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్దేశించారు. ఇన్నిరోజుల్లో ఈసేవలు అందిస్తామన్న విషయాన్ని తెలిపేలా గ్రామ, వార్డు సచివాలయాల్లో బోర్డులు ప్రజలకు స్పష్టంగా కనిపించేలా ఉన్నాయా? లేవా? అనే అంశాన్ని మరోసారి పరిశీలన చేయాలని సీఎం ఆదేశించారు. అమ్మ ఒడి పథకానికి అధికారులు అన్నిరకాలుగా సిద్ధం కావాలని నిర్దేశించారు సీఎం జగన్.

ALSO READ: సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు.. విగ్రహాల విధ్వంసకులను దేవుడే శిక్షిస్తాడన్న ముఖ్యమంత్రి