న్యూ ఇయర్ వేడుకలపై కేరళ సర్కార్ కీలక నిర్ణయం.. రాత్రి 10 గంటలలోపు ముగించాలని ఆదేశం

కేరళలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా బహిరంగ సభలను నిషేధిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

న్యూ ఇయర్ వేడుకలపై కేరళ సర్కార్ కీలక నిర్ణయం..  రాత్రి 10 గంటలలోపు ముగించాలని ఆదేశం
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 31, 2020 | 6:28 AM

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పడుతుందని భావిస్తున్న తరుణంలో కొత్త వైరస్ స్ట్రెయిన్ అంటుకుంది. బ్రిటన్ రిటర్స్న్ నుంచి వ్యాప్తి చెందుతున్న ఈ వ్యాధి పట్ల అయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. తాజాగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేరళలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా బహిరంగ సభలను నిషేధిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం కేరళలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ రాత్రి 10గంటలలోపు ముగించాలని సర్కారు ఆదేశించింది. ప్రజలందరూ కోవిడ్ నిబంధనలు పాటించాలన్న అధికారులు.. ప్రతి ఒక్కరు ఫేస్ మాస్కుల వాడకం, సామాజిక దూరం పాటించాలని, శానిటైజ్ చేసుకోవాలని సూచించారు. కేంద్రం సూచించిన కోవిడ్ 19 మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని, లేకుండా కరోనా కేసుల సంఖ్య పెరిగే ప్రమాదముందని కేరళ రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరించారు. కోవిడ్-19 నిబంధనలను పాటించని వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని సర్కారు హెచ్చరించింది. కొవిడ్ 19 మార్గదర్శకాలను పాటించేలా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.