ఐవీఆర్‌సీఎల్ సంస్థపై కేసు నమోదు చేసిన సీబీఐ.. సంస్థ కార్యాలయం, నిందితుల నివాసాల్లో సోదాలు

బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకుండా ఐవీఆర్‌సీఎల్ సంస్థ మోసగించినట్టు ఎస్‌బీఐ అభియోగాలు మోపింది.

ఐవీఆర్‌సీఎల్ సంస్థపై కేసు నమోదు చేసిన సీబీఐ.. సంస్థ కార్యాలయం, నిందితుల నివాసాల్లో సోదాలు
Follow us

|

Updated on: Dec 31, 2020 | 6:12 AM

బ్యాంకుల ఎగవేత కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. అక్రమార్కలకు పాల్పడ్డారన్న నేపథ్యంలో ఐవీఆర్‌సీఎల్ సంస్థపై కేసు నమోదు చేసిన సీబీఐ.. నిందితుల జాబితాలో ఎండీ సుధీర్ రెడ్డి, జేఎండీ బలరామి రెడ్డి సహా పలువురి పేర్లను చేర్చింది. ఐవీఆర్‌సీఎల్ సంస్థ పేరుతో రూ. 4,837కోట్ల మేర బ్యాంకులను మోసగించినట్టు ఫిర్యాదు అందించింది. ఈ మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు స్వీకరించిన సీబీఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

కాగా, సంస్థ ఎలాంటి ఆధారాలు లేని లావాదేవీలతో నిధులను దారిమళ్లించినట్టు తేల్చిన ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్టును రూపొందించింది. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ.. హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయం, నిందితుల నివాసాల్లో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో అనేక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు సీబీఐ అధికారులు వెల్లడించారు. ఎస్‌బీఐ ఆధ్వర్యంలోని ప్రభుత్వరంగ బ్యాంకుల ద్వారా ఐవీఆర్సీఎల్ సంస్థ కన్సార్షియం నుంచి రుణాలు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకుండా మోసగించినట్టు ఎస్‌బీఐ అభియోగాలు మోపింది. దీంతో కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు దర్యాప్తు చేపట్టారు.

Latest Articles
32 ఏళ్ల క్రితమే ఆ హీరోయిన్ జమల్ కుడు డాన్స్ చేసిందా ?
32 ఏళ్ల క్రితమే ఆ హీరోయిన్ జమల్ కుడు డాన్స్ చేసిందా ?
దీపికతో పెళ్లి ఫొటోలను డిలీట్ చేసిన రణ్‌వీర్ సింగ్.. కారణమిదేనా?
దీపికతో పెళ్లి ఫొటోలను డిలీట్ చేసిన రణ్‌వీర్ సింగ్.. కారణమిదేనా?
810 కిలోల బంగారం తీసుకెళ్తున్న వాహనం రోడ్డుపై బోల్తా.. ఒక్కసారిగా
810 కిలోల బంగారం తీసుకెళ్తున్న వాహనం రోడ్డుపై బోల్తా.. ఒక్కసారిగా
రెండు చేతులూ లేకపోయినా.. బాధ్యతగా ఓటు వేసిన అంకిత్
రెండు చేతులూ లేకపోయినా.. బాధ్యతగా ఓటు వేసిన అంకిత్
మండే ఎండల్లో కూలింగ్ న్యూస్.. ఏపీకి వచ్చే 2 రోజులు వర్షాలు..
మండే ఎండల్లో కూలింగ్ న్యూస్.. ఏపీకి వచ్చే 2 రోజులు వర్షాలు..
గంటల తరబడి ఏసీలో ఉంటున్నారా.? ఈ సమ్యలున్నాయో చెక్‌ చేసుకోండి
గంటల తరబడి ఏసీలో ఉంటున్నారా.? ఈ సమ్యలున్నాయో చెక్‌ చేసుకోండి
RRతో మ్యాచ్..టాస్ ఓడిన ఢిల్లీ.. జట్టులో టీమిండియా సీనియర్ ప్లేయర్
RRతో మ్యాచ్..టాస్ ఓడిన ఢిల్లీ.. జట్టులో టీమిండియా సీనియర్ ప్లేయర్
అమిత్ షా హామీతో మరింత దూకుడుగా అరవింద్!
అమిత్ షా హామీతో మరింత దూకుడుగా అరవింద్!
డీబీటీతో రాజకీయం చేస్తున్నదెవరు? భూ ప్రకంపనలు వైసీపీని తాకాయా?
డీబీటీతో రాజకీయం చేస్తున్నదెవరు? భూ ప్రకంపనలు వైసీపీని తాకాయా?
ఈ వ్యాపారం స్టార్ట్ చేస్తే లక్షలు సంపాదించే అవకాశం.!
ఈ వ్యాపారం స్టార్ట్ చేస్తే లక్షలు సంపాదించే అవకాశం.!