భార్యను కాల్ గర్ల్‌గా మార్చిన కేసులో శాడిస్ట్ భర్తను అరెస్ట్ చేసిన పోలీసులు.. కాసేపట్లో మీడియా ముందుకు..
Sadistic Husband arrested: భార్యను కాల్ గర్ల్‌గా మార్చి న్యూడ్ ఫొటోలతో బ్లాక్ మెయిలో చేసిన కేసులో శాడిస్ట్ భర్త రేవంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Sadistic Husband arrested: భార్యను కాల్ గర్ల్‌గా మార్చి న్యూడ్ ఫొటోలతో బ్లాక్ మెయిలో చేసిన కేసులో శాడిస్ట్ భర్త రేవంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్దిగంటల్లో మీడియా ముందు ప్రవేశపడతామన్నారు. ఈ సందర్భంగా పోలీసులు పలు వివరాలను వెల్లడించారు. టీటీడీకి చెందిన ఓ కాలేజీలో జూనియర్ అసిస్టెంటుగా పని చేస్తున్న రేవంత్ నాలుగు నెలల క్రితం నిరోషాను ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. వివాహం అనంతరం ఆదనపు కట్నం తేవాలంటూ ఆమెను వేధించడం మొదలు పెట్టాడని చెప్పారు. ఈ క్రమంలో ఆమెను మానసికంగా హింసించడంతో నిరోషా గతంలో అలిపిరి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిందని అన్నారు. దీంతో ఇద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించామని తెలిపారు.
అయినా తీరు మార్చుకొని రేవంత్ మరింత వేధింపులకు గురిచేయడమే కాక వారిద్దరూ సన్నిహితంగా ఉన్న వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడన్నారు. అంతేగాక ఆమె న్యూడ్ ఫొటోలను పోస్టు చేసి గంటకు రూ. 3వేలు అంటూ భార్యను కాల్ గర్ల్‌గా చిత్రీకరించాడని తెలిపారు. దీంతో నిరోషా మరోసారి స్టేషన్‌కు రావడంతో రేవంత్‌ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని చెప్పారు. కాగా నిందితుడికి కొంతమంది పోలీసులు కూడా సహకరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో వారిపై కూడా చర్యలు ఉంటాయని సమాచారం తెలుస్తోంది.