Nara Lokesh: సుబ్బయ్య హత్య నిందితులను కఠినంగా శిక్షించాలి.. లేదంటే రాయలసీమ వ్యాప్తంగా ఉద్యమమే..
Nara Lokesh: కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణ హత్యకు గురైన తెదేపా నేత సుబ్బయ్య అంత్యక్రియలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా
Nara Lokesh: కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణ హత్యకు గురైన తెదేపా నేత సుబ్బయ్య అంత్యక్రియలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ , పార్టీ సీనియర్‌నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సుబ్బయ్య అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. హత్యకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ప్రసాద్‌రెడ్డి ఆయన బావమరిది బంగారురెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాధ పేర్లను నిందితుల జాబితాలో చేర్చాలంటూ డిమాండ్ చేశారు. సుబ్బయ్య కుటుంబానికి తెలుగుదేశం పార్టీ పార్టీ తరపున రూ.20 లక్షలు ప్రకటించారు. సుబ్బయ్య కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సుబ్బయ్య పిల్లలను చదివించే బాధ్యత కూడా పార్టీ తీసుకుంటుందని తెలిపారు. సుబ్బయ్య హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై 15 రోజుల్లోగా పోలీసులు కేసు నమోదు చేయాలని లేదంటే రాయలసీమ వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని లోకేష్ హెచ్చరించారు. అనంతరం సుబ్బయ్య భార్య స్టేట్‌మెంట్ నమోదు ద్వారా వారి ముగ్గురి పేర్లను నిందితుల జాబితాలో చేర్చేందుకు పోలీసులు అంగీకరించారు.