AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: మీ ఇద్దరి మధ్య గొడవలతో ముద్దులొలికే ముగ్గురు పిల్లల్ని చిదిమేశావ్ కదా బ్రదర్

కుటుంబ కలహాలు ఓ పచ్చని సంసారంలో చిచ్చుపెట్టాయి... భార్యతో గొడవపడి తన ముగ్గురు పిల్లలతో బయటకు వెళ్లిన భర్త తన పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఏపీలోని యర్రగొండపాలెం మండలం బోయలపల్లికి చెందిన వెంకటేశ్వర్లు తెలంగాణాలోని పెద్దపూర్‌ దగ్గర శవమై తేలాడు. భార్యతో గొడవ పడి తన ముగ్గురు పిల్లలతో బయటకు వెళ్లిన వెంకటేశ్వర్లు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. వెంకటేశ్వర్లు, మరో ముగ్గురు పిల్లల మృతదేహాలు లభించాయి. ఈ ఘటన వెంకటేశ్వర్లు స్వగ్రామం బోయలపల్లిలో విషాదాన్ని నింపింది.

Andhra: మీ ఇద్దరి మధ్య గొడవలతో ముద్దులొలికే ముగ్గురు పిల్లల్ని చిదిమేశావ్ కదా బ్రదర్
3 Kids and Father Venkatedwarlu
Fairoz Baig
| Edited By: |

Updated on: Sep 04, 2025 | 3:14 PM

Share

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం బోయలపల్లి కి చెందిన గుత్తా వెంకటేశ్వర్లు కుటుంబ కలహాల కారణంగా తన ముగ్గురు పిల్లలను తీసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లి అదృశ్యమయ్యాడు. గత నెల 30వ తేదిన భార్య దీపికతో నెలకొన్న కుటుంబ కలహాల కారణంగా వెంకటేశ్వర్లు తన ముగ్గురు పిల్లలతో బైక్‌పై ఎక్కించుకుని వెళ్లిపోయాడు. ఆ తరువాత వారి జాడ లేకపోవడంతో దీపిక పోలీసులను ఆశ్రయించింది. వెంకటేశ్వర్లు తన ముగ్గురు పిల్లలైన 8 ఏళ్ళ మోక్షిత, 6 ఏళ్ళ వర్షిణి, 4 ఏళ్ళ శివ ధర్మలను బైక్‌పై తీసుకుని గత నెల 30 న ఇంటి నుండి వెళ్ళి పోయాడు. మూడురోజుల తరువాత తెలంగాణ రాష్ట్రం నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పెద్ద పూర్ వద్ద పురుగుల మందు తాగి మృతి చెందినట్టు గుర్తించారు… అతని డెడ్ బాడీని రాత్రి బోయలపల్లికి తీసుకుని వచ్చి దహన సంస్కారాలు చేశారు. అయితే ముగ్గురు పిల్లల ఆచూకీ తెలియ లేదు. చంపేసాడా లేక ఎక్కడైనా వదిలేసాడా అనేది తెలియక బంధువులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.  వెంకటేశ్వర్లు మృతదేహం లభించిన తెలంగాణాలోని పెద్దపూర్‌ పరిసర ప్రాంతాల్లో గాలించగా మరో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభించాయి. ఆ తరువాత పెద్ద పాప మృతదేహం కూడా అక్కడే లభించింది… 8 ఏళ్ళ పెద్దపాప మోక్షిత, 6 ఏళ్ళ వర్షిణి, 4 ఏళ్ళ శివ ధర్మల మృతదేహాలు పూర్తిగా కాలిపోయి గుర్తించలేని స్థితిలో దొరికాయి.

యర్రగొండపాలెం మండలం బోయలపల్లికి ఎరువుల వ్యాపారి గుత్తా వెంకటేశ్వర్లు తన భార్యతో గొడవపడి గత నెల 30వ తేదిన ముగ్గురు పిల్లలతో బైక్ పై ఇంటి నుంచి బయల్దేరి ఆచూకీ లేకుండా పోయాడు… గుత్తా వెంకటేశ్వర్లుకు భార్య దీపిక, కుమార్తెలు మోక్షిత, రఘవర్షిణి, కుమారుడు శివధర్మ ఉన్నారు. ఆయన స్థానికంగా ఎరువుల దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. గతనెల 30న పాఠశాల నుంచి వచ్చిన ముగ్గురు పిల్లలను వెంకటేశ్వర్లు బైక్‌పై తీసుకెళ్లారు. అనంతరం ఇంటికి తిరిగి రాకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో దీపిక ఫిర్యాదు చేశారు. పోలీసుల గాలింపులో నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం హాజీపూర్ వద్ద ఓ హోటల్ సీసీ ఫుటేజ్ ఆధారంగా అక్కడ ఇద్దరు పిల్లలను దించి….పెద్ద కుమార్తెతో చారకొండ మండలం జూపల్లి దాబా వరకు వెంకటేశ్వర్లు బైక్ పై వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిలోని వెల్దండ మండలం బుర్రకుంట సమీసంలో చెట్ల మధ్య వెంకటేశ్వర్లు విగతజీవిగా పడి ఉండటాన్ని గుర్తించారు. ఆ తరువాత అదే పరిసర ప్రాంతంలో ముగ్గురు చిన్నారులు 8 ఏళ్ళ పెద్దపాప మోక్షిత, 6 ఏళ్ళ వర్షిణి, 4 ఏళ్ళ శివ ధర్మల మృతదేహాలు పూర్తిగా కాలిపోయి గుర్తించలేని స్థితిలో లభించాయి… ఈ ఘటనతో వెంకటేశ్వర్లు స్వగ్రామం బోయలపల్లిలో విషాదఛాయలు అలముకున్నాయి.